Site icon HashtagU Telugu

CM Revanth: ఓయూ ఘటనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కేసీఆర్ తీరుపై ఫైర్!

Telangana

Telangana

CM Revanth: వేసవి సెలవుల్లో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లను మూసివేయడంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ను చూస్తుంటే గోబెల్స్ పునర్జన్మ పొందినట్లే కనిపిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట, మహబూబ్ నగర్ సభల్లో కేసీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీపై దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.

వేసవి సెలవులకు (మే 12 నుంచి జూన్ 5 వరకు) హాస్టళ్లు, మెస్ లను మూసివేయాలని 2023 మేలో కూడా వర్సిటీ చీఫ్ వార్డెన్ ఇదే విధమైన నోటీసు జారీ చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ నోటీసులో కూడా చీఫ్ వార్డెన్ విద్యుత్, తాగునీటి కొరత గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ హయాంలోనే యూనివర్సిటీ హాస్టళ్లను మూసివేస్తున్నట్లు కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ సరిగా పాలించడం లేదని నిరూపించడానికి కేసీఆర్ దిగజారిపోతున్నారో దీన్ని బట్టి అర్థమవుతోందని రేవంత్ అన్నారు.

Also Read: Hyderabad: గేమింగ్ అడ్డాపై పోలీసులు దాడులు.. లేడీ డాన్ అరెస్ట్, భారీ నగదు స్వాధీనం