Medigadda: మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలిస్తున్న సిఎం రేవంత్ బృందం

  • Written By:
  • Updated On - February 13, 2024 / 04:49 PM IST

 

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన బృందం మేడిగడ్డ చేరుకుంది. డ్యామేజ్ అయిన బ్యారేజ్ పిల్లర్లను సిఎం రేవంత్ బృందం పరిశీలిస్తోంది. మొత్తం 85 పిల్లర్లలో డీ బ్లాక్ లో 7 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. సీఎం రేవంత్ టీమ్ తో పాటు ఇంజినీరింగ్ నిపుణులు కూడా ఉన్నారు. వారు కూడా బ్యారేజ్ ను పరిశీలిస్తున్నారు. బ్యారేజ్ ను పరిశీలించిన నిపుణులు.. ఆ వివరాలను సీఎం రేవంత్(cm revanth reddy), మంత్రులు, ఎమ్మెల్యేల బృందానికి వివరిస్తోంది. అక్కడే ఉన్న ఇరిగేషన్ అధికారులు కూడా ప్రాజెక్ట్ గురించి వివరిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్(medigadda-barrage) పరిశీలన తర్వాత ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ టీమ్ సమీక్ష నిర్వహిస్తుంది. రివ్యూ అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఈ రోజు ఉదయం మేడిగడ్డ ఆనకట్ట కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు శాసనసభ, మండలి సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక బస్సులో వెళ్లారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. మేడిగడ్డ సందర్శనకు సభ్యులందరిని ప్రభుత్వం ఆహ్వానించగా బీఆర్ఎస్(brs), బీజేపీ(bjp) ఎమ్మెల్యేలు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎం, సీపీఐ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లో వెళ్లారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద అధికార యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. డీఐజీ, నలుగురు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్సైలు, సుమారు 800 మంది పోలీసు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను సీఎం బృందం పరిశీలించే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

read also : Smart Phones Survey : భారతీయులకు ఫోన్‌ ఎందుకు వాడుతున్నారో తెలియదట.. సంచలన నివేదిక

Follow us