Site icon HashtagU Telugu

Heavy Rains : అలర్ట్ గా ఉండాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు

CM Revanth Reddy reviews torrential rains, floods, issues key instructions to officials

CM Revanth Reddy reviews torrential rains, floods, issues key instructions to officials

తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం సర్వత్రా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖలకు అత్యవసర సూచనలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు హై అలర్ట్‌లో ఉండి, వర్షాల పరిస్థితిని క్షణక్షణం సమీక్షించాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షాల కారణంగా సమస్యలు తలెత్తితే వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ క్రమంలో పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Dussehra Holidays: అంగన్‌వాడీ కేంద్రాలకు తొలిసారి దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

ఇక విద్యాసంస్థల విషయానికొస్తే..దసరా (Dasara) సెలవులు ఉన్నా పాఠశాలలు, కళాశాలలు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, విద్యాసంస్థలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. వర్షాలు కురిసే సమయంలో రవాణా వ్యవస్థలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సూచనలు ఇచ్చారు. ప్రత్యేకంగా విద్యార్థులు మరియు ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా రోడ్లపై నీరు నిల్వ కాకుండా చూడాల్సిందిగా సూచించారు.

ప్రజల విషయంలోనూ సీఎం రేవంత్ హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు తప్ప వర్షం పడుతున్న సమయంలో రోడ్లపైకి రావొద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు. వర్షాలు తీవ్రతరమైతే విద్యుత్, రవాణా వంటి సేవల్లో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉందని, కాబట్టి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటంతో పాటు, ప్రజల సహకారం కూడా అత్యవసరమని స్పష్టమవుతోంది.

Exit mobile version