Site icon HashtagU Telugu

Cm Revanth: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. త్వరలో మేడిగడ్డ, సుందిళ్ల పరిశీలన

Cm Revanth Reddy (6)

Cm Revanth Reddy (6)

Cm Revanth: కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రివర్గ సహచరులతో చర్చించారు.  ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ కుంగిపోవటం, సుందిళ్ల బ్యారేజీకి బుంగలు పడటం వంటి అంశాలను పరిశీలించిన #NDSA ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది.

ఈ నివేదికలోని ముఖ్యమైన అంశాలు, సిఫారసులను అధికారులు వివరించారు. 2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని తోసిపుచ్చలేమని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో స్పష్టం చేసింది. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైనా కేబినేట్‌లో చర్చించాల్సి ఉంటుందని సీఎం అన్నారు.

రిపేర్లు చేయడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయా, మరింత నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనేది నీటి పారుదల విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.  శనివారం నాటి కేబినేట్ భేటీ జరగకపోవటంతో ఈ కీలకమైన అంశాలపైనా చర్చించలేకపోయారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడి పంప్ హౌస్‌లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

Exit mobile version