Site icon HashtagU Telugu

Telangana Economic Situation : తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Cm Revanth's Key Comments O

Cm Revanth's Key Comments O

తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై సీఎం రేవంత్ (CM Revanth) కీలక వ్యాఖ్యలు చేసారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రం (Telangana State) రూ. 69,000 కోట్ల అప్పుతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే గత 10 ఏళ్లలో తెలంగాణ అప్పు (Telangana Debt) దాదాపు రూ. 7 లక్షల కోట్లకు పెరిగిందని రేవంత్ వెల్లడించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రభుత్వం నిర్వహించిన ఆర్థిక విధానాల వల్లే ఈ స్థాయిలో అప్పు పెరిగిందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ, ఆదాయ వనరులు అధికంగా ఉన్నప్పటికీ, అప్పు పెరుగుదల పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు.

 

Ancient Coins : ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు వింత శబ్దం..తవ్వితే !

KCR పాలనలో విపరీతంగా పెరిగిన అప్పు

కేంద్రం నుండి వచ్చే నిధులు, రాష్ట్రానికి ఉన్న సంపద, వనరులు సరిగ్గా ఉపయోగించాల్సిన పరిస్థితిలో, KCR ప్రభుత్వం అప్పులు తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోందని సీఎం రెవంత్ రెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, వాటి లాభాలు ప్రజలకు పూర్తిగా అందలేదని విమర్శించారు. ఈ రుణ భారం భవిష్యత్తు తరాలకు భారంగా మారుతుందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు చర్యలు

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని నిలబెట్టేందుకు పలు చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్థిక వివరణ, అప్పుల తగ్గింపు, పెట్టుబడిదారులను ఆకర్షించే విధానాలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. మున్ముందు అన్ని ఖర్చులను పారదర్శకంగా ఉంచి, అవసరమైన చోట మాత్రమే నిధులను వినియోగించే విధంగా కొత్త విధానాలు తీసుకురాబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. KCR ప్రభుత్వం వృథాగా ఖర్చు చేసిన ఖజానా నుంచి రూపాయి కూడా వృథా కాకుండా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయడమే తమ లక్ష్యమని సీఎం రెవంత్ రెడ్డి అన్నారు.