తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(MLC Addanki Dayakar)పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ లో అందరు అద్దంకి దయాకర్ లాగే ఓపికతో, స్థిరతతో ఉండాలన్నారు. పార్టీ కోసం త్యాగాలు చేయడంలో, నిబద్ధత చూపడంలో ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒక సందర్భంలో దయాకర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని యోచించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదని పేర్కొన్నారు. అయినా ఆయన నిస్వార్థంగా పార్టీతోనే కొనసాగుతూ, నమ్మకాన్ని నిలబెట్టుకున్నారన్నారు.
Coconut Ritual: గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
“దయాకర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయినా, ఆయన ఓపిక చూపించాడు. పార్టీలో శ్రద్ధతో, సమయస్పూర్తితో ఉన్నవారికి ఎప్పుడూ గౌరవం దక్కుతుంది. దయాకర్ మాదిరిగా పార్టీలో అందరూ ఉంటే, కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుంది” అని చెప్పారు. ప్రస్తుతం దయాకర్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నదీ ఆయన ఓపిక, నిబద్ధత వల్లే సాధ్యమైందని రేవంత్ అభిప్రాయపడ్డారు.
దయాకర్ తన జీతంలో 10 శాతం ఏఐసీసీకి, 15 శాతం పీసీసీకి ఇవ్వడం గురించి మాట్లాడిన రేవంత్, ఇది పార్టీపై ఆయనకు ఉన్న భక్తి, నిబద్ధతకు నిదర్శనమన్నారు. పార్టీకి అండగా నిలబడి, పార్టీ అభివృద్ధిలో భాగస్వామిగా మారే ధృక్పథం ప్రతి కార్యకర్తలో ఉండాలన్నారు. దయాకర్ లాంటి నాయకులు యువతకు ప్రేరణగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో పార్టీకి తనకున్న నమ్మకాన్ని, నిబద్ధతను సీఎం మరోసారి స్పష్టం చేశారు.