IAS Officers : ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ క్లాస్

IAS Officers : నేటి పరిస్థితుల్లో కొందరు కలెక్టర్లు ఏసీ గదుల్లోనే కూర్చొని ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

Published By: HashtagU Telugu Desk
Cm Ias

Cm Ias

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఐఏఎస్ అధికారులకు (IAS Officers) క్లాస్ పీకారు. గతంలో అధికారుల తీరు ప్రజలకు అనుకూలంగా ఉండేదని, నేటి పరిస్థితుల్లో కొందరు కలెక్టర్లు ఏసీ గదుల్లోనే కూర్చొని ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ సర్వీసు అధికారుల విధి నేరుగా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడం కావాలని సూచించారు.

హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్ స్టిట్యూట్‌లో లైఫ్ ఆఫ్ ఎ కర్మయోగి ( ‘Life of A Karma Yogi-Memoir of A Civil Servant ‘) పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ పుస్తకాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణన్ రచించారు. ఈ సందర్భంలో అధికారులు తమ విధి నిర్వహణలో నిబద్ధతతో ఉండాలని, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఫీల్డ్‌లో ఎక్కువ సమయం గడపాలని సీఎం రేవంత్ అన్నారు.

Karan Johar : రాజ‌మౌళి సినిమాల‌కు లాజిక్ అవ‌స‌రం లేదు

గతంలో రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల్లో లోటుపాట్లను వివరించే నిబద్ధత కలిగిన అధికారులు ఉండేవారని, అయితే ఇప్పుడలా జరిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. పాలనకు సంబంధించిన సమస్యలను అధికారులే విశ్లేషించాల్సిన బాధ్యత వహించాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అనుభవం, ప్రజల్లోనుంచే వస్తుందని స్పష్టం చేశారు. కొందరు అధికారులు ఫీల్డ్‌వర్క్‌ను పట్టించుకోకుండా ఏసీ గదుల్లో సమయం గడపడం అభ్యర్థనీయమేమీ కాదని అన్నారు. ప్రజల మద్యకు వెళ్లి, వారి సమస్యలు స్వయంగా తెలుసుకోవడమే అసలైన పరిపాలన అని, దీని వల్ల అధికారులకు అనుభవం పెరిగి, మెరుగైన పాలన అందించగలుగుతారని చెప్పారు.

తన అధికారిక పదవిలో ప్రజాసేవకు నిబద్ధతతో ఉన్న అధికారులకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని, నిబద్ధత కలిగిన అధికారులను ప్రోత్సహించడంలో తాను ముందుంటానని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కాబట్టి, అధికారులు కేవలం విధి నిర్వహణకే పరిమితం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఫీల్డ్‌వర్క్‌ను ప్రాముఖ్యతనిచ్చేలా తమ ఆలోచనా విధానంలో మార్పు తేవాలని సీఎం సూచించారు.

  Last Updated: 17 Feb 2025, 11:43 AM IST