MLA డాక్టర్ మట్టా రాగమయి (MLA Dr. Matta Ragamayee) ఆధ్వర్యంలో సత్తుపల్లి (Sathupalli ) నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు (CM Revanth Reddy Birthday) వేడుకలు అంబరాన్ని తాకాయి. నియోజకవర్గం లోని అన్ని మండలాల ఆటో డ్రైవర్ కార్మికులకు సుమారు 2500 మందికి నిత్యావసర సరుకులు పంపిణి చేసి వారిని సంతోష పెట్టారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్బంగా ఈరోజు ఉదయం కల్లూరు మ్యాంగో మార్కెట్ నుండి కల్లూరు మార్కెట్ యార్డ్ ప్రాంగణం వరకు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కల్లూరు పట్టణం, కల్లూరు మండలం , పెనుబల్లి మండలం, తల్లాడ మండలం ఆటో డ్రైవర్ ల కార్మికులు, మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, NSUI నాయకులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కల్లూరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు తో కలిసి శ్రీ రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు” కేక్ ” ను ఎమ్మెల్యే కట్ చేసారు.
అనంతరం సత్తుపల్లి పట్టణం, సత్తుపల్లి మండలం, వేంసూరు మండలంలోని 1500 మంది ఆటో డ్రైవర్ కార్మికులకు ” నిత్యావసర సరుకులు ” అందించారు. ఈ కార్యక్రమం లో సత్తుపల్లి AMC చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి ,వైస్ చైర్మన్ కోటేశ్వరరావు,సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు, కల్లూరు పట్టణ, కల్లూరు మండలం, తల్లాడ మండలం, పెనుబల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ఆటో కార్మిక సోదరులు పాల్గొన్నారు.
Read Also : Health Tips : ఆస్తమా, బ్రోన్కైటిస్, COPD… ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి?