Site icon HashtagU Telugu

CM Revanth Delhi : ఉమ్మడి ఆస్తుల విభజనపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Cm Revanth Delhi

Cm Revanth Delhi

రెండు రోజుల పర్యటన లో భాగంగా ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..వెళ్లిన దగ్గరి నుండి బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఢిల్లీ (Delhi)లో తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజన, నూతన తెలంగాణ భవన్ నిర్మాణ విషయాలపై దృష్టి సారించారు. ఉమ్మడి ఆస్తిలో తెలంగాణ వాటా, నూతన భవనాల నిర్మాణంపై తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డి సంజయ్ జాజులతో రేవంత్ చర్చించారు.

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ విషయంలో కేంద్రం చూపించిన పరిష్కారానికి తెలంగాణ సర్కార్ అంగీకరించే అకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో ఢిల్లీలో అశోక రోడ్ లోని ఏపీ-తెలంగాణ భవన్ తమకే కావాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ, ఏపీ అధికారుల ముందు తెలంగాణ అధికారులు ప్రతిపాదనలు ఉంచారు. హైదరాబాద్ హౌస్ కి అనుకొని ఉన్న స్థలంతో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని గతంలో హోంశాఖ, ఏపీ అధికారులకు తెలంగాణ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఏపీ- తెలంగాణ భవన్, శబరి బ్లాక్, రోడ్డు, నర్సింగ్ హాస్టల్ సహా 12 ఎకరాల పైగా భూమి తమకు చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షగా హోంశాఖ, ఏపీ అధికారులకు తెలంగాణ అధికారులు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉమ్మడి ఆస్తుల విభజనపై సమావేశం తర్వాత గత ఏప్రిల్ 26న కేంద్ర హోంశాఖ సమావేశం మినిట్స్ విడుదల చేసింది. పటోడి హౌస్ 7.64 ఎకరాల స్థలాన్ని తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ప్రతిపాదించింది. శబరి బ్లాకు, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ బ్లాక్ లను 12.09 ఎకరాలు ఏపీకి ఇవ్వాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రతిపాదన ఆచరణ యోగ్యంగా ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గతంలో కేసీఆర్ సర్కార్ ఇంకా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఆమోదం తెలియచేయడం ఖరారైంది.

Read Also : UPSC: సివిల్స్ అభ్యర్థుల ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసిన UPSC