CM Revanth Reddy : తెలుగు రాష్ట్రాల్లో అగ్ర రాజకీయ నాయకులందరూ యూత్ కాంగ్రెస్ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైతం యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయ జీవితాన్ని ఆరంభించారని ఆయన తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో తెలంగాణ యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
హనుమంతరావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతలు యూత్ కాంగ్రెస్‌లో పనిచేశారని రేవంత్ గుర్తుచేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన వారని ఆయన చెప్పారు. యూత్ కాంగ్రెస్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి తొలి మెట్టు అని, పదవులు రాకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యం కావాలని సూచించారు.
Talasani Srinivas Yadav : ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్‌కు తలసాని శ్రీనివాస్ సవాల్
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ: “తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందజేశాం. పేదల ఆత్మగౌరవం కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టాం. డబుల్ బెడ్‌రూమ్ పేరిట కేసీఆర్ ప్రజలను మోసం చేశారు. ఆయన మోసానికి ప్రజలు గట్టి సమాధానం ఇచ్చి మాకు అధికారం అందించారు. స్థానిక సంస్థల్లో యూత్ కాంగ్రెస్‌కు ప్రాధాన్యం ఇస్తాం. పార్టీ కోసం నిజంగా శ్రమించే వారికే పదవులు ఇస్తాం. ఫ్లెక్సీలు పెట్టేవారికి కాదు, ప్రజల్లో పని చేసే వారికే గుర్తింపు ఉంటుంది.”
“దేశంలోనే ఎవరూ చేయని రీతిలో తెలంగాణ రైతులకు రుణమాఫీ అమలు చేశాం. భూమి లేని వారికీ రూ.12 వేలు అందిస్తున్నాం. 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను యూత్ కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. డబ్బుతో గెలుపు సాధ్యం కాదు, ప్రజాభిమానమే గెలిపిస్తుంది. డబ్బులే గెలిపిస్తాయంటే కేసీఆర్‌కు 100 సీట్లు రావాల్సింది.” “కేసీఆర్ కొడితే గట్టిగా కొడతానని అంటున్నారు. కానీ, కేసీఆర్‌ను ఓడించాలంటే కేటీఆర్, కవిత, హరీశ్‌రావులనే ఓడించాలి. కేటీఆర్‌ను ప్రజలు ఓడించారు, కవితను ప్రజలు తిరస్కరించారు. కల్వకుంట్ల కుటుంబ అవినీతిని ప్రజలు బహిరంగంగా తిరస్కరించారు.”
“మేము దేశంలో ఏకైక ప్రభుత్వం, కులగణన పూర్తి చేసినది. కేసీఆర్ కేవలం ఒక రోజులో కాకిలెక్కలు లాంటి సర్వే చేశారు. కులగణనను తప్పుడు లెక్కలతో దారితప్పించారు. కులగణన ప్రజల హక్కు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కులగణన సర్వేలో పాల్గొనలేదని వారిని సామాజిక బహిష్కరణ చేయాలని నిర్ణయించాం.” “ప్రధాని నరేంద్ర మోదీ లీగల్ కన్వర్టెడ్ బీసీ. 2002 వరకు ఆయన ఉన్నత వర్గానికి చెందినవారు. గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీల్లో చేర్చుకున్నారు. కులగణనలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల ఇళ్ల ముందు డప్పు కొట్టాలని పిలుపునిచ్చారు.” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Thummala Nageswara Rao : రుణాలు ఎగ్గొడుతున్న పెద్దలపై ఎందుకిలా మౌనం? బ్యాంకర్లపై మంత్రి తుమ్మల ఫైర్