తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే (Caste Census Survey) దేశ చరిత్రలో ఓ కీలక మైలు రాయిగా నిలిచింది. ఈ సర్వే ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) పూర్తిగా స్పూర్తితో నిర్వహించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రశంసించారు. “ఈ సర్వే చేయడం కష్టమని అనుకున్నాను, కానీ ఇది చరిత్రలో ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది. బీజేపీ అంగీకరించినా లేకపోయినా కులగణన జరగడం చారిత్రాత్మక ఘట్టం” అని రాహుల్ గాంధీ అన్నారు. కులగణన హామీని భారత్ జోడో యాత్రలో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నెరవేర్చిందని తెలిపారు.
Ola S1 Sales: ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ వద్దంటున్న కస్టమర్లు.. ఎందుకంటే?
ఈ సర్వే ప్రక్రియను సోనియా గాంధీ (Sonia Gandhi) స్వయంగా మెచ్చుకుంటూ లేఖ రాయడం విశేషం. ఈ లేఖ తనకు ఆస్కార్ అవార్డు, నోబెల్ ప్రైజ్ కన్నా ఎక్కువగా భావిస్తున్నట్టు సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. “తెలంగాణ మోడల్ అంటే ఇదే, దేశానికి దిశ చూపే విధంగా ఈ కులగణన సర్వే చేయడం జరిగింది. వందేళ్ల తర్వాత దేశంలో మొదటిసారిగా చొరవ చూపి ప్రజల నుంచి స్వయంగా వివరాలు సేకరించాం” అని వివరించారు. అగ్రకులాల నుంచి వచ్చిన అభ్యంతరాల్ని సామరస్యంగా పరిష్కరించామని కూడా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రధాని మోదీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు, కేవలం లీగల్‌గా ఓబీసీ అయ్యారు. దేశం కోసం మోదీ ఏమీ చేయరు, ఓబీసీలకు మద్దతివ్వరు” అని విమర్శించారు. “రైతు నల్ల చట్టాలను వెనక్కి తిప్పే కృషి రాహుల్ గాంధీదే, ఇప్పుడు కులగణనను కేంద్రం అంగీకరించేందుకు కారణం కూడా ఆయనే. కానీ ఆర్‌ఎస్ఎస్ మాత్రం ఇప్పటికీ కులగణనకు వ్యతిరేకమే” అని స్పష్టం చేశారు.
Illegal Relationship : అక్రమసంబంధాల్లో హైదరాబాద్ ఏ ప్లేస్ ఉందో తెలుసా..?
కులగణన పూర్తయ్యాక ఏడాదిలోనే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు గర్వంగా ఉందని సీఎం రేవంత్ తెలిపారు. “కాంగ్రెస్ ఉంటే అన్నీ ఉంటాయి, లేకపోతే ఏమీ ఉండదు. ఈ సర్వే నూటికి నూరుపాళ్లుగా ప్రజలే ఇచ్చిన సమాచారం ఆధారంగా రూపొందించాం. ఈ గణన నిజాయితీగా జరిగిందని ఎవరికైనా అభ్యంతరం ఉంటే సాక్ష్యాలతో ప్రూఫ్ చేయాలని ఇదే నా ఛాలెంజ్” అని తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియ దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని సీఎం వ్యక్తం చేశారు.