Site icon HashtagU Telugu

CM Revanth Public Meeting: రేపు పెద్ద‌ప‌ల్లిలో సీఎం రేవంత్ భారీ బ‌హిరంగ స‌భ‌.. వారికి నియామ‌క ప‌త్రాలు!

CM Revanth Highlights

CM Revanth Highlights

CM Revanth Public Meeting: ప్రజా విజయోత్సవాలల్లో భాగంగా రేపు (బుధ‌వారం) పెద్దపల్లి భారీ బహిరగసభను ప్రభుత్వం నిర్వ‌హించ‌నుంది. ‘యువ శక్తి’ సభ పేరుతో ప్రభుత్వం ఈ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ స‌భ‌లో 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Public Meeting) అందించ‌నున్నారు. ఇటీవల గ్రూప్ IVలో ఎంపికైన 8143 మందికి, 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి సీఎం ఉద్యోగ నియామ‌క ప‌త్రాల‌ను అందించ‌నున్నారు. ఈ సభలోనే స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యమయ్యే 7 ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోనున్నారు. అలాగే డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ప్రారంభించ‌నున్నారు.

అలాగే సీఎం కప్ ప్రారంభంతో పాటు వందలాది కోట్ల రూపాయల విలువైన అనేక కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించ‌నున్నారు. వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను తెలియచేసే దాదాపు 40 స్టాళ్లు సభా వేదిక వద్ద ఏర్పాటు చేశారు.

Also Read: Delhi Super Power : షిండే వెనుక ‘సూపర్ పవర్’.. ఫడ్నవిస్‌‌ సీఎం కాకుండా అడ్డుకునే కుట్ర

డిసెంబర్ 4వ తేదీన పెద్ద పల్లిలో నిర్వహించే యువ శక్తి సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై దాదాపు 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయ‌నున్నారు. పెద్దపల్లిలో డిసెంబర్ 4వ తేదీన తలపెట్టిన ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లపై ఇటీవ‌ల అధికారులు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తయిన సందర్బంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యువతకై ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ సభలో ఇటీవల గ్రూప్-4లో ఎంపికైన 8143 మందికి, 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందచేస్తారని అధికారులు వివరించారు.

ఈ సభలోనే స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యమయ్యే 7 ఏజెన్సీలతో ఒప్పంద పత్రాలను సంతకం చేయడం జరుగుతుందని,డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ప్రారంభోత్సవం, సీఎం కప్ ప్రారంభోత్స‌వంతో పాటు వందలాది కోట్ల రూపాయల విలువైన అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను తెలియచేసే దాదాపు 40 స్టాళ్లను ఈ సభా వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వరంగల్, మహబూబ్ నగర్‌లో మాదిరిగానే పెద్దపల్లి సభకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారుల‌ను మంత్రులు ఇప్ప‌టికే ఆదేశించిన విష‌యం తెలిసిందే.