CM Revanth Vs Harish Rao : సీఎం రేవంత్ vs హరీష్ రావు ..తగ్గేదేలే

బీఆర్ఎస్ ఫినిష్ కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీష్ రావే అన్నారు

  • Written By:
  • Publish Date - June 28, 2024 / 10:32 AM IST

ఢిల్లీ పర్యటన లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..బిఆర్ఎస్ ఫై , మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ..హరీష్ రావు ట్రాప్ లో ఉన్నాడని..ఆలా ఉన్నంతకాలం బిఆర్ఎస్ ఎదగదని, కేసీఆర్ పొలిటికల్‌గా నిలదొక్కుకోవడం కూడా జరగదని జోస్యం తెలిపారు. పార్టీ బతికితే కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత ఉంటారని.. అందుకే బీఆర్ఎస్ ఫినిష్ కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీష్ రావే అన్నారు. హరీష్ రావు ఎప్పుడూ ఏదో సంక్షోభాన్ని సృష్టించి తనకు అనుకూలంగా ఆ ఇష్యూను మలుచుకుంటారన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకాకపోతే హరీష్ రావే మాట్లాడతారని.. అందుకే హరీష్ వ్యూహ్యాత్మంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.

మాజీ సీఎం కేసీఆర్‌కు సిగ్గుండాలి. అసెంబ్లీకి రమ్మంటే రాడు. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించినా రాడు. తన కుటుంబానికే అన్ని కావాలనే స్వార్థంలో ఉన్నారు. 64 సీట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాది. ఆది కేసీఆర్‌ కుప్పకూలిపోతుందని కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ బీజేపీతో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయాలని అనుకోలేదా?. కాంగ్రెస్‌ను ఓడించాలనే బీఆర్‌ఎస్‌ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించారు. సిరిసిల్ల, సిద్దిపేటలో బీజేపీకి అన్ని ఓట్లు పడ్డాయంటే అర్థమేంటి? పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్‌కు లేదు. ఎంతో మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న విషయం ఆయనకు గుర్తులేదా? ఫిరాయింపులకు పునాది వేసింది బీఆర్‌ఎస్‌ అంటూ రేవంత్ ఘాటుగా స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కయ్యాయని రేవంత్ రెడ్డి ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. మెదక్‎లో బిజెపిని బిఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బిఆర్ఎస్ మెజారిటీ సాధించిందని గుర్తు చేశారు. రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బిఆర్ఎస్ మెజారిటీ సాధించిందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో బీజేపీకి మెజారిటీ వచ్చింది అని, అక్కడ బిజెపీకి కాంగ్రెస్ ఓట్లు ఆయనే మళ్లించారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్‎నగర్‎లో బిజెపి ఎలా గెలిచిందని అడిగారు. రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజిగిరిలో బీజేపీ అంతటి మెజార్టీతో ఎలా గెలిచింది.. అక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీజేపీకి వేయమని చెప్పింది ఎవరు.? ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీని గెలిపించిందా? అంటూ రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి ఎదురు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కేసుల భయంతో బీజేపీ పంచన చేరి, ప్రధాని మోదీ శరణు కోరారు. అందుకే తెలంగాణలో బీజేపీ ఇన్ని స్థానాల్లో విజయం సాధించగలిగిందని హరీష్ రావు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ సిద్ధాంతాలను అమలు చేస్తున్నది రేవంత్ రెడ్డే అని.. గతంలో నిండు సభలో మోదీని పెద్దన్న అని సంబోధించింది కూడా రేవంత్ రెడ్డే అని విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు.

Read Also : Tragic Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి