CM Revanth Visit Medaram : మేడారం వనదేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్

  • Written By:
  • Updated On - February 23, 2024 / 04:48 PM IST

శుక్రవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) మేడారం (Medaram) సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ప్రత్యేక హెలికాప్టర్లో మేడారానికి చేరుకున్న ఆయనకు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆచార సంప్రదాయాలను అనుసరించి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు సీఎం. మేడారం జాతరలో సీఎంతో పాటు అమ్మవార్ల దర్శనం చేసుకున్నవారిలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉదయం మేడారం జాతరను సందర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ (Governor Tamilisai Soundar Rajan) ఇక్కడి పరిసరాల్లోని ఆరు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా, రాష్ట్ర మంత్రి సీతక్కలతో కలిసి సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, వరుసగా మూడుసార్లు ఈ జాతరకు రావడం తన అదృష్టమన్నారు.

ఇదిలా ఉంటె మేడారం లో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు వీఐపీలు అమ్మవార్ల దర్శనానికి రావడంతో పోలీసులు సాధారణ భక్తుల క్యూలైన్ను నిలిపివేశారు. అప్పటికే గంటల కొద్దీ క్యూ లైన్లో ఉన్న భక్తులు..మరోసారి నిలిపివేయడం తో వారు ఆగ్రహానికి గురయ్యారు. ఇదే క్రమంలో పోలీసులు వారి ఫై దురుసుగా ప్రవర్తించడం తో వారంతా తిరగబడ్డారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. కాసేపటికి భక్తులను దర్శనానికి పంపించడం తో వారు శాంతించారు.

Read Also : Telangana IAS Transfers : తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీలు