Site icon HashtagU Telugu

CM Revanth : కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Yashoda

Revanth Yashoda

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR)..ఆరోగ్యం కుదుటపడుతుంది. గురువారం రాత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక (KCR injures his hip after a fall) విరిగిన సంగతి తెలిసిందే. దీంతో యశోద హాస్పటల్ వైద్య బృందం శుక్రవారం సాయంత్రం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేసారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని డాక్టర్స్ వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. డాక్టర్స్ వాకర్ సాయంతో కేసీఆర్ ను నడిపిస్తున్నారు. ఇక కేసీఆర్ హాస్పటల్ లో చేరిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున పార్టీ నేతలు , శ్రేణులతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు హాస్పటల్ కు వెళ్లి పరామర్శిస్తూ వస్తున్నారు.

ఈరోజు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ..యశోద హాస్పటల్ కు వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగి..డాక్టర్స్ ను కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ వెంట షబ్బీర్ అలీ , మంత్రి సీతక్క , వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక సీఎం వచ్చిన సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ దగ్గరుండి..రేవంత్ ను ICU లోకి తీసుకెళ్లి మాట్లాడడం జరిగింది. ఇక కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం మీడియా తో సీఎం రేవంత్ మాట్లాడడం జరిగింది. అంతకు ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ హాస్పటల్ కు వెళ్లి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

Read Also : Mayawati Successor : రాజకీయ వారసుడి పేరును ప్రకటించిన మాయావతి