Site icon HashtagU Telugu

Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. రేష‌న్ కార్డుల‌పై కీల‌క నిర్ణ‌యం!

Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting: తెలంగాణ‌లో నేడు కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాలయంలో శ‌నివారం మంత్రి వ‌ర్గం (Telangana Cabinet Meeting) సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ భేటీలో ప‌లు అంశాల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. మూసీ పునరుజ్జీవ చర్యలు, హైడ్రా, 317 జీవో, ఉద్యోగుల డీఏలు, కొత్త రేషన్‌ కార్డుల జారీ తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడా పాలసీపైనా కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్టు స‌మాచారం.

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో స‌మావేశం జ‌ర‌గ‌నున్నట్లు అధికారులు శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ స‌మావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. క్యాబినేట్ ఎజెండాలో 317జీవో, కులగణన, ధరణి, కొత్త ఆర్‌వోఆర్‌ చట్టం, రైతుభరోసా, ధాన్యం కొనుగోలు పాలసీ, ఉద్యోగుల డీఏ, కొత్త రేష‌న్ కార్డుల జారీపై కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. వారి పాస్‌పోర్టులు ర‌ద్దు!

అదేవిధంగా మూసీ పునరుజ్జీవం, మంత్రుల సియోల్ పర్యటన, హైడ్రా, ఇందిరమ్మ ఇళ్లపైనా కీల‌క స‌మీక్ష చేయ‌నున్నారు. సోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, స్పోర్ట్స్ పాలసీ, ఎకో టూరిజం పాలసీల‌పై నేడు కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు. మూసీ పునరుజ్జీవం,హైడ్రా, కొత్త రెవెన్యూ చట్టంపై అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు..లేదా అఖిలపక్ష భేటీకి నిర్ణ‌యం తీసుకోనుంది.

సీఎం రేవంత్ సంతాపం

గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గుస్సాడీ కనకరాజుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల కోసం ఉత్తర్వులు జారీ చేశారు. అరుదైన కళాకారుడు కనకరాజు మరణం పట్ల సీఏం రేవంత్ సంతాపం వ్య‌క్తం చేశారు. కనకరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్ర‌క‌టిస్తున్న‌ట్లు సీఎం రేవంత్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.