Site icon HashtagU Telugu

Revanth Reddy : ఢిల్లీకి రేవంత్.. మంత్రుల శాఖలపై చర్చ

Revanth Sonia

Revanth Sonia

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరికాసేపట్లో ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. తెలంగాణ రెండో సీఎం గా నిన్న గురువారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం సచివాలయంలో సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాబినెట్ భేటీ ఏర్పాటు చేసి..రెండు హామీలపై క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు ఈరోజు ఉదయం నుండి ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి..ప్రజలనుండి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రస్తుతం కరెంట్ అంశంపై అధికారులతో రివ్యూ ఏర్పాటు చేసారు.

ఇది పూర్తి కాగానే రేవంత్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. నిన్న సీఎంగా రేవంత్ రెడ్డి తో పాటు మొత్తం 11 మంది.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే వీళ్లకు శాఖలు కేటాయించలేదు. అధిష్టానం నుంచి క్లారిటీ లేకపోవడంతో శాఖలు ఆలస్యం అయ్యింది.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో ఈరోజు రేవంత్ ఢిల్లీ వెళ్లి మంత్రుల శాఖల కేటాయింపుపై క్లారిటీ తీసుకోనున్నారు. పలువురు కాంగ్రెస్ పెద్దలను రేవంత్ కలిసి..ఇంకో ఆరుగురు మంత్రులను ఎవ్వరిని నియమించాలన్న అంశాలపై అధిష్టానంతో చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీ పూర్తికాగానే రాత్రికి ఢిల్లీ నుండి తిరుగు ప్రయాణం అవుతారు. ఇక రేపు ఉదయం 8:30 గంటలకు ప్రొటెం స్పీకర్ చేత రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభకానున్నాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరు దాదాపు ఖరారు అయ్యింది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.

Read Also : Jagan Potato : ఉల్లిగడ్డని ‘Potato’ అంటారట..జగన్ మీకు జోహార్లు ..