జన్వాడ ఫామ్‌హౌజ్ ఘటన (Janwada Farmhouse incident)పై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై స్పందించారు. ఫామ్‌హౌజ్ ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నట్లు అనుమానాలను వ్యక్తం చేశారు. అది ఫామ్‌హౌజ్ కాదు, రాజ్ పాకాల కొత్త ఇల్లు. ఫ్యామిలీ ఫంక్షన్‌ను రేవ్ పార్టీగా అసత్య ప్రచారం చేసారు. రేవ్ పార్టీలో పిల్లలు, వృద్ధులు ఉంటారా ? అని ప్రశ్నించారు. ఇది రాజకీయంగా కేటీఆర్‌పై బురద జల్లడానికి ప్రయత్నం అని విమర్శించారు. కేటీఆర్‌ను టార్గెట్ చేయడం మూసీ విషయంలో పేదల పక్షాన పోరాటం చేస్తున్నందుకే జరిగిందని హరీష్ రావు పేర్కొన్నారు.
బండి సంజయ్(Bandi Sanjay) తన స్థాయికి తగ్గించుకుని మాట్లాడుతున్నారు. అయన కేంద్ర సహాయ మంత్రిగా కాదు..రేవంత్ రెడ్డి(Revanth Reddy) కి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారని..రేవంత్ తానా అంటే.. బండి సంజయ్(Bandi Sanjay) తందానా అంటున్నారని ఎద్దేవా చేసారు. బాధ్యత కలిగిన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ అవాస్తవాలు మాట్లాడటం బాధాకరమైన విషయమన్నారు. రేవంత్ రెడ్డికి మెదడు నిండా విషమే తప్పా.. విజన్ లేదని సెటైర్లు వేశారు. కేటీఆర్ క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేయటం మంచిది కాదని హెచ్చరించారు.
బండి సంజయ్ తీరు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిలా కాకుండా, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నట్టు ఉన్నది.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/pBb7K7SL0I
— BRS Party (@BRSparty) October 28, 2024
Read Also : Wedding Season : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్.. నవంబరు, డిసెంబరులో 21 శుభ ముహూర్తాలు