Site icon HashtagU Telugu

Kaleshwaram Scam: కాళేశ్వరం విచారణకు హరీష్, కేసీఆర్?

Kaleshwaram Scam

Kaleshwaram Scam

Kaleshwaram Scam: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా TSPSC పేపర్ లీకేజీ మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ నష్టంపై దృష్టి సారించాడు.ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న విధంగా TSPSC పేపర్ లీకేజీ మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ నష్టం అంశాలను పరిశోధించడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే మేడిగడ్డ మరియు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తానని నిన్న మండలిలో రేవంత్ ప్రకటించి సంచలనం సృష్టించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తానని హాట్ కామెంట్స్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించిన తర్వాత. కాంట్రాక్టు ఇచ్చిన వారిని, సంబంధిత శాఖ మంత్రులు, కాంట్రాక్టర్లను చట్ట ప్రకారం శిక్షిస్తామని రేవంత్ అన్నారు. ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. రెండో దఫాలో కేసీఆర్ ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. దీంతో ఆ ఇద్దరినీ కూడా విచారించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

Also Read: Andhra chicken Pulao: ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్రాస్టైల్ స్పైసీ చికెన్ పులావ్.. ట్రై చేయండిలా?