CM Revanth Reddy’s Speech at Telangana Praja Palana Dinotsavam : సెప్టెంబర్ 17 (September 17th) ను ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ (Prajapalana Dinotsavam) గా సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఉదయం అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించి, అనంతరం పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ (Revanth Reddy)..సెప్టెంబర్ 17 ఎలా నిర్వహించుకోవాలనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని..ఈ రోజును కొందరు విలీన, ఇంకొందరు విమోచన దినోత్సవం అని సంభోదిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఈ శుభదినాన్ని ప్రజాపాలన దినోత్సవంగా జరపడం సముచితమని భావించాం. అందుకే ఈరోజు ప్రజాపాలన దినోత్సవం గా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాలను ఎగురువేశామని సీఎం తెలిపారు. 1948లో తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాపాలనకు నాంది పలికారు. అందుకే ప్రజా కోణాన్ని జోడిస్తూ ఈ పేరును పెట్టాం’ అని తెలిపారు.
తానేమీ ఫామ్ హౌస్ సీఎం కాదు
నియంత నుంచి తెలంగాణకు స్వేచ్ఛ కల్పిస్తామని ఆనాడు ప్రజలకు భరోసా ఇచ్చామన్న ఆయన, పదేళ్ల పాటు విధ్వంసమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడతామని హామీ ఇచ్చారు. హైడ్రాను బెదిరిస్తున్న భూ మాఫియాను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రం, కేంద్రానికి మధ్య ఎన్నో సత్సంబంధాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర నుంచి రావాల్సిన పన్నుల వాటాలు, నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని స్పష్టం చేశారు. దాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చోవడానికి తానేమీ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదని తెలంగాణ ప్రజాపాలన వేడుకల సందర్భంగా ఎద్దేవా చేశారు.
పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా, ఆర్థికంగా పునరుజ్జీవం చేయాలి
పీసీసీ చీఫ్ గా తాను బాధ్యతలు స్వీకరించినపుడు నియంతల పాలన నుంచి తెలంగాణను విడిపిస్తానని మాటిచ్చానని, గతేడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి.. మాట నిలబెట్టుకున్నామన్నారు. ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. అమరుల ఆశయాలు, యువత ఆకాంక్ష ఉండాలన్నారు. పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా, ఆర్థికంగా పునరుజ్జీవం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, అస్థిత్వం అంటే తమ కుటుంబానిదేనని గత పాలకులు భావించి.. కుటుంబ పాలన చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను అర్థంచేసుకునే ఉద్దేశం వారికి లేదన్నారు. నిజాంని మట్టికరిపించిన చరిత్ర తెలంగాణకు ఉందన్న విషయాన్ని మరచి.. రాష్ట్ర ప్రజలు తమ దయా, దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటారని భ్రమించారని విమర్శించారు.
మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టామని గుర్తు చేసిన సీఎం.. ఈ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. అలాగే గద్దర్ పేరున సినిమా అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు.
Read Also : Tecno pova5 pro: రూ. 20 వేల ఫోన్ కేవలం రూ. 12 వేలకే.. పూర్తి వివరాలు ఇవే!