CM Revanth seeks Central Funds for Permanent Flood Control Measures : తెలంగాణ (Telangana) లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు , వరదలకు (Heavy Rains and Floods
) దాదాపు రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి సీఎం రేవంత్ (CM Revanth Reddy) సూచించారు. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో వరదల వల్ల జరిగిన నష్టం గురించి వివరించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల వాటిల్లిన నష్టం వివరాలను కేంద్ర బృందానికి (Central Team) సీఎం తెలిపారు. వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసి, ప్రాణ నష్టం లేకుండా చేసిందని పేర్కొన్నారు.
ఎక్కడెక్కడ నష్టం తీవ్రంగా జరిగిందో కేంద్ర బృందానికి తెలిపిన మంత్రులు
శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వరద నష్టంపై కేంద్ర బృందంతో సీఎం భేటీ అయ్యారు. ఈ భేటీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన వరద నష్టం గురించి కేంద్ర బృందానికి మంత్రులు వివరించారు. ఎక్కడెక్కడ నష్టం తీవ్రంగా జరిగిందో చెప్పారు. పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల గురించి వివరించడంతో పాటు ఆస్తినష్టం జరిగిన తీరును కూడా కేంద్ర బృందానికి సవివరంగా తెలిపారు. వీలున్నంత త్వరగా సాయం అందిస్తేనే వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, నిబంధనలను పక్కనబెట్టి, మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని, భారీ వర్షాలకు ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమై కాలనీలే నీటిలో మునిగిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారని , ఇండ్లు, పంటలు నష్టపోయి భారీగా నాశపోయారని..రేవంత్ కేంద్ర బృందానికి తెలిపారు.
మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం
రాష్ట్రంలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని, నిధి ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలన్నారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయం నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
Read Also : Harish Rao : రాహుల్ గాంధీ లెక్చర్లు ఆపు – హరీష్ రావు