CM Revanth Reddy: 12 సీట్లతో బీఆర్ఎస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా..? : రేవంత్

12 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్న కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. హుజూరాబాద్ జనజాతర బహిరంగసభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...కరీంనగర్ జిల్లా వాసుల్ని ఆకాశానికి ఎత్తేశాడు.

CM Revanth Reddy: 12 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్న వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. హుజూరాబాద్ జనజాతర బహిరంగసభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…కరీంనగర్ జిల్లా వాసుల్ని ఆకాశానికి ఎత్తేశాడు. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులని పొగిడారు. ఎర్రజెండా నీడలో ఎంతో మంది విప్లవకారులు ఈ జిల్లా నుంచి పోరాటాలు చేశారు. చింతమడక నుంచి వచ్చిన కేసీఆర్ కు కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. అయితే కరీంనగర్ ను వదిలి కేసీఆర్ మహబూబ్ నగర్ వస్తే ఆలోచించకుండా గెలిపించిన విషయాన్నీ నొక్కి చెయ్యరు సీఎం. ఈ సందర్భంగా కేసీఆర్ పై రేవంత్ మండిపడ్డారు.

కారు కరాబు అయి మూలకుపడింది. కారు మూలకు పడింది కాబట్టే కేసీఆర్ బస్సు ఎక్కాడు. తిక్కలోడు తిరనాళ్లకు పోయినట్లు కేసీఆర్ బస్సు యాత్ర ఉందని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది. మహబూబ్ నగర్, చేవేళ్ల, భువనగిరి, కరీంనగర్,మల్కాజ్ గిరి లాంటి సీట్లలో బీజేపీని గెలిపించాలని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు. నల్గొండ, మెదక్ లాంటి సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నది బీజేపీ ప్రయత్నం. అయితే కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానివ్వం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ గోడ మీద వాలినా కాల్చి అవతలపారేస్తం. అయినా 12 సీట్లతో బీఆర్ఎస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అంటూ ప్రశ్నించారు రేవంత్.

తెలంగాణ నిరుద్యోగులకు మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా మాట ఇస్తున్న ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేస్తా.. వెలిచాల రాజేందర్ రావును కరీంనగర్ ఎంపీగా లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు సీఎం రేవంత్.

Also Read: Alliance-Ycp Manifesto: కూటమి-వైసీపీ మేనిఫెస్టోలో తేడాలు ఇవే..!