CM Revanth: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాట: సీఎం రేవంత్

  • Written By:
  • Updated On - February 10, 2024 / 10:56 PM IST

CM Revanth: అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లడుతూ ఆర్టీసీ బలోపేతానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణ బద్దలై పనిచేస్తున్నది. ఆర్టీసీ మనది. తెలంగాణ ప్రజలందరిది. ఆర్టీసీకి గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా నాన్చుడు ధోరణి అవలంబించడం వల్ల ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాటలోకి వెళ్తుంది. మహాలక్ష్మి పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆర్టీసీకి కొత్త బస్సులు సమకూర్చాలని వచ్చిన ఆలోచన ఫలితంగా నేడు ఆర్టీసీ బలోపేతం అవుతున్నది.

ఆర్టీసీ సంస్థలో డ్రైవర్లు, కార్మికులు పేద, మధ్యతరగతి వర్గాల వారు. వీరికి సక్రమంగా జీతాలు రావాలంటే ఆర్టీసీ బాగుపడాలి. వీరందరి బాగు కోసం ఆర్టీసీ సంస్థను బాగు చేస్తాం. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడం వల్ల రాష్ట్రంలో 15 కోట్ల 50 లక్షల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేశారని అన్నారు. మహిళలు ప్రయాణం చేసిన జీరో టికెట్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీకి చెల్లిస్తున్నాం.

గత ప్రభుత్వాల మాదిరిగా ఆర్టీసీపై కాంగ్రెస్ ప్రభుత్వం భారం మోపడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో 70 శాతం పైగా మహిళలు మిగతా పురుషులు ప్రయాణం చేయడం వల్ల నిండుగా కనిపించడమే కాకుండా ఈ సంస్థకు ఆదాయం సమకూరుతుంది. బస్సులు నేడు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆర్టీసీలో జరిగిన సమ్మె చారిత్రాత్మకం. గత దశాబ్ద కాలం పాటు ఆర్టీసీ కార్మికులు వారి హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు.