CM Revanth : HMDA, GHMC అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక

  • Written By:
  • Publish Date - February 23, 2024 / 11:40 PM IST

HMDA, GHMC అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీ చేసారు. 15 రోజుల్లో రెండు కార్యాలయాల్లో విజిలెన్స్ దాడులు జరుగుతాయని రేవంత్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం GHMCపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘చాలా బిల్డింగ్స్ అనుమతుల ఫైల్స్ కనిపించడం లేదు. ఆన్లైన్లో అప్రూవల్ ఇవ్వకుండా బిల్డింగ్స్ ఇచ్చిన అనుమతుల జాబితా వెంటనే సిద్ధం చేయాలనీ, ఆక్రమణలకు గురికాకుండా చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే చెరువుల ఆన్లైన్ డేటా ఎందుకు లీక్ అవుతోంది’ అని సీఎం ప్రశ్నించారు. 15 రోజుల్లో హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జరుగుతాయని చెప్పిన సీఎం ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికిపోతారని తెలిపారు. ఆన్‌లైన్‌లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితా తయారు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్‌కు తాగు నీటి సరఫరా అయ్యేలా ప్రణాళిక రచించాలని సీఎం ఆదేశించారు. ఔటర్ రింగు రోడ్డు బయట ఉన్న చెరువులను క్లస్టర్లుగా విభజించాలని సూచించారు. వచ్చే 50 ఏళ్ల తాగు నీటి అవసరాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త‌గా ఏర్ప‌డిన 85 మున్సిపాలిటీల్లో క‌మిష‌న‌ర్లు లేక‌పోవ‌డంపై సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

హైద‌రాబాద్‌లో విలువైన ప్ర‌భుత్వ ఆస్తుల జాబితాను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు హైద‌రాబాద్‌లో ఏవైనా ప్రారంభోత్స‌వాలు ఉంటే వారం రోజుల్లో పెట్టుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. మెట్రో కొత్త మార్గాల‌కు త్వ‌ర‌లో శంకుస్థాప‌న చేయనున్నట్లు తెలిపారు.

Read Also : Samantha : సమంత లేటెస్ట్ బికిని స్టిల్స్.. సోషల్ మీడియాని షేక్.. మలేషియాలో రచ్చ రంబోలా..!