తెలంగాణ (Telangana ) లో గత నాల్గు రోజులుగా అల్లు అర్జున్ (Allu Arjun) కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. అల్లు అర్జున్ అరెస్టైనప్పుడు KTR ట్వీట్తో దుమారం రేగింది. సీఎం (CM Revanth Name) పేరును మరచిపోయాడని చెప్పి అల్లు అర్జున్ ను కుట్రపూరితంగా టార్గెట్ చేస్తున్నారని రేవంత్ పై బిఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. దీనికి ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్.. మాకు అల్లు అర్జున్ తో ఎలాంటి గొడవలు లేవని , అతడి వల్ల ఓ ప్రాణం పోయిందని అందుకు చట్టం తన పని తాను చేసుకుంటూపోతుంది తప్ప మరోటి లేదని , అసలు బీఆర్ఎస్సే డైరెక్షన్స్ ఇస్తోందని ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్, బిఆర్ఎస్ అభిమానులు ఒకవైపు, కాంగ్రెస్ మరోవైపు ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు.
ఇక అసెంబ్లీ వేదికగా రేవంత్ మాటలపై కూడా బన్నీ రియాక్ట్ అయ్యాడు. దానికి కూడా కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ఇలా రోజు రోజుకు ఈ వ్యవహారం ఎక్కడికో వెళ్తుండడం తో పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇటు సీఎం రేవంత్ కు , అటు అల్లు అర్జున్ కు పలు సూచనలు సూచినట్లు తెలుస్తుంది. అందుకే అటు అల్లు అర్జున్ ఈ వ్యహారంలో అభిమానులెవరు జోక్యం చేసుకోవొద్దని , అసభ్యకర పోస్టులు పెట్టద్దని సూచించారు.
ఇటు సీఎం రేవంత్ కూడా మంత్రులకు, పార్టీ నేతలకు అల్లు అర్జున్ వ్యవహారంలో ఎవరూ ఏమీ మాట్లాడవద్దని ఆదేశించారు. మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో కూడా అల్లు అర్జున్ వ్యవహారంపై పార్టీకి చెందిన నేతలు ఎవరూ మాట్లాడవద్దన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు మాట్లాడకుండా చూడాలని తెలంగాణ పీసీసీకి సీఎం స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు సమాచారం. నిన్న మంత్రి కోమటి రెడ్డి తో పలువురు మాట్లాడిన తీరు చూస్తే ఇక ఈ వ్యవహారం సర్దుమణిగినట్లే అని అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈరోజు అల్లు అర్జున్ ను పోలీసులు విచారించబోతున్నారు. మరి ఈ విచారణ లో బన్నీ ని ఏ ప్రశ్నలు అడుగుతారో..? దానికి ఇలాంటి సమాదానాలు చెపుతారో చూడాలి. ఏది ఏమైనప్పటికి ఈ గొడవ త్వరగా సర్దుమణిగితే బాగుంటుందని ఇటు అభిమానులు, సినీ ప్రముఖులు , ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
Read Also : America Tour : అమెరికా పర్యటనకు వెళ్లనున్న జైశంకర్