తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జనవరి 14 నుంచి మూడు దేశాల పర్యటనకు వెళ్లాలని ప్రకటించినప్పటికీ, ఆస్ట్రేలియా పర్యటన (Australia Tour) రద్దయింది. మొదట ఢిల్లీ, సింగపూర్, దావోస్‌లకు వెళ్లాలని నిర్ణయించుకున్న సీఎం, అనివార్య కారణాలతో ఆస్ట్రేలియా పర్యటనను షెడ్యూల్ నుంచి తొలగించారు. జనవరి 14న ఢిల్లీకి వెళ్లి, 15న కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
Vaikunta Ekadasi 2025 : గోవింద నామ స్మరణతో మారుమోగిపోతున్న తిరుమల
జనవరి 17న ఢిల్లీ నుంచి సింగపూర్‌కు వెళ్లి, అక్కడ రెండు రోజులు పర్యటించనున్నారు. అనంతరం జనవరి 19న దావోస్‌కు వెళ్లి, జనవరి 23 వరకు జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, ఇతర అధికారులు కూడా హాజరవుతారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల ఆహ్వానానికి వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతోంది.
అలాగే అస్ట్రేలియా పర్యటనలో క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సహా పలు క్రీడా మౌలిక సౌకర్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి భావించారు. అయితే, కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభోత్సవం కారణంగా ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసినట్లు అధికార వర్గాలు తెలిపారు. రద్దయిన పర్యటన భవిష్యత్తులో పునరుద్ధరణ కావచ్చని అంచనా. ఈ పర్యటన ద్వారా తెలంగాణకు పెట్టుబడులు, అంతర్జాతీయ వ్యాపార ప్రోత్సాహకాలు అందించడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. గత ఏడాది సదస్సులో రూ.40 వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది సదస్సులో కూడా తెలంగాణ ప్రతినిధులు అద్భుతమైన ఫలితాలు సాధించాలని ఆశిస్తున్నారు.