అమెరికా (America ) కు చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి ఘన స్వాగతం లభించింది. రాష్ట్రానికి పెట్టుబడుల్ని తీసుకురావడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. న్యూయార్క్‌లో రేవంత్‌రెడ్డి బృందానికి అక్కడి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. న్యూయార్క్‌లో ఈరోజు ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొనబోతున్నారు. సీఎం వెంట ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి సహా పలువురు అధికారులు ఉన్నారు. పెట్టుబడుల నిమిత్తం న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
10 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాతో పాటు, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. అమెరికా నుండి నేరుగా దక్షిణ కొరియా వెళ్తారు. అనంతరం అక్కడ పర్యటన ముగించుకొని తిరిగి సీఎం బృందం ఈ నెల 14వ తేదీన ఉదయం హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటారు. ఈ పది రోజుల పర్యాటనలో భాగంగా సీఎం బృందం పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆగస్టు 06 న ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. మూసీ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న మిగతా ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది రేవంత్ టీమ్.
పర్యటన లో భాగంగా రూ. 50 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా చర్చలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరపనున్నారు. వీరిలో ప్రముఖంగా అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ సీఈవో, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సీవోవో, పెప్సీ కో సీనియర్ మేనేజ్‌మెంట్, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన వారు ఉన్నారు.
Read Also : Train Fare Concessions: సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలలో ప్రత్యేక తగ్గింపు లభిస్తుందా..?