Site icon HashtagU Telugu

Phone Tapping : సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ! ఆ అధికారిపై వేటు

Cm Revanth Will Hand Over The Selection Papers To The Constable Candidates Today

Cm Revanth Will Hand Over The Selection Papers To The Constable Candidates Today

Phone Tapping : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్, బీజేపీ కీలక నేతల ఫోన్లను ట్యాంపరింగ్ చేసినట్లు  ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావ్‌ను సస్పెండ్ చేశారు. గత ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలీజెన్స్ బ్రాంచ్ (sib)లో ప్రణీత్ కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్నారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసు శాఖలో పలువురు అధికార దుర్వినియోగానికి (Phone Tapping) పాల్పడ్డారనే అంశంపై అంతర్గతంగా విచారణ జరిపారు. దానికి సంబంధించిన నివేదిక ఆధారంగా డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ పోలీసు శాఖ  కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సోమవారం రాత్రి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.  గతంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ప్రణీత్‌ను విధుల నుంచి తప్పించారు. అయితే  రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి స్థాయి దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. మరింత మంది పేర్లు బయటికి వచ్చే ఛాన్స్ ఉంది.

We’re now on WhatsApp. Click to Join

మీ ఫోన్ హ్యాక్ అయిందని మీకు తెలుసా? మీకు తెలియకుండా ఎవరో మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు జాగ్రత్త.. ఇటీవల ఇలాంటి కేసులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆపిల్ ఐఫోన్లను లక్ష్యంగా చేసుకుని ‘స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్‌లు’ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం తమ ఐఫోన్లను ఎవరో ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తీవ్రదుమారం రేపుతోంది. ఇంతకీ మీ ఫోన్ హ్యాక్  అయిందో లేదో ఎలా తెలుసుకోవడం అనుకుంటున్నారా? కింది పాయింట్స్ చదువుకోండి.

Also Read : BJP: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. గెలుపే లక్ష్యంగా ముందడుగులు

ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోతోందా ? 

ఫోన్ బ్యాటరీ సాధారణం కన్నా వేగంగా ఛార్జింగ్ అయిపోతుంటే మీరు అప్రమత్తం కావాల్సిందే. కొన్ని మాల్వేర్‌లు లేదా మోసపూరిత యాప్‌లు అధిక శక్తిని హరించే హానికరమైన కోడ్‌ని ఉపయోగించడం వల్ల ఇలా జరుగుతుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్‌లు మీ ఫోన్ బ్యాటరీని తినేస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద సంఖ్యలో యాప్‌లు రన్ కాకుండా చూసుకోండి.

ఫోన్ వేడెక్కుతోందా ? 

ఫోన్‌ను మీరు ఎక్కువగా వాడకున్నా.. అది వేడెక్కుతుంటే అనుమానించాలి. మీ ఫోన్‌ను హ్యాకర్లు కంట్రోల్ చేస్తుంటే అలా జరుగుతుంటుంది.

సోషల్ అకౌంట్లలో యాక్టివిటీ

మీ ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో మీకు తెలియకుండానే ఏవైనా పోస్టులు వచ్చేస్తే.. అలర్ట్ కావాలి.   మీ ఫోన్ హ్యాక్ అయిందనే దానికి క్లియర్ సంకేతం అది.  మీ ఫోన్ నుంచి ఈమెయిల్‌లను పంపడం/స్వీకరించడం ఆగిపోయినా మీ ఫోన్ హ్యాక్ అయినట్టే.

ఫోన్ స్లో 

మీ ఫోన్ అకస్మాత్తుగా స్లో అయితే అలర్ట్ కండి. ఫోన్‌లోకి వచ్చిన స్టెల్త్ మాల్వేర్ వల్ల అలా జరుగుతుంటుంది. వెంటనే చెక్ చేసి జాగ్రత్త పడండి.

ఫోన్ క్రాష్ 

మీ ఫోన్‌లోని యాప్‌లు తరచుగా క్రాష్ అవుతుంటే.. అవి లోడ్ కావడంలో ఫెయిల్ అవుతుంటే అలర్ట్ కండి. మాల్ వేర్ ఎఫెక్టు వల్ల ఇలా జరుగుతుంది. సడెన్‌గా ఫోన్ రీబూట్‌, షట్‌డౌన్‌, రీస్టార్ట్ అవుతున్నా జాగ్రత్తపడ్డాలి. ఫోన్ స్క్రీన్ లైటింగ్‌లో ఆకస్మిక మార్పులు కనిపించినా అది మాల్వేర్ ఎఫెక్టే  అయి ఉండొచ్చు.