CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిన్నారు. ఈ పర్యటనలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా భారీ ప్రాజెక్టులు, శాశ్వత మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు.
తుర్కపల్లి మండలంలోని గంధమల్ల వద్ద 66 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు నిర్మించబోయే గంధమల్ల రిజర్వాయర్‌కు సీఎం రేవంత్ భూమిపూజ చేశారు. అంతేకాకుండా, యాదగిరిగుట్టలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్ కాలేజ్, వేద పాఠశాలలకు కూడా శంకుస్థాపన నిర్వహించారు.
ఈ పర్యటనలో ఆయన మోటకొండూరులో నిర్మించబోయే ఎంపీపీ కార్యాలయం, మండల ఆఫీస్, పోలీస్ స్టేషన్ భవనాలకు భూమిపూజ చేయడం జరిగింది. అలాగే కొలనుపాక-కాల్వపల్లి మధ్య హైలెవెల్ వంతెన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.
ఆలేరు నియోజకవర్గంలో మొత్తం రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను సీఎం ఈ పర్యటనలో ప్రారంభించారు. తుర్కపల్లిలోని తిర్మలాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… “మూసీ నది శుద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలోనే ఈ ప్రక్రియపై స్పష్టత ఇచ్చాం. గోదావరి జలాలను వాడుకుని మూసీ ప్రక్షాళన చేపడతాం. సబర్మతి, గంగా, యమునల వలె మూసీ నదిని కూడా శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎర్రవల్లి, మొయినాబాద్, జన్వాడ ఫాం హౌస్‌లను తీసుకుంటామనలేదు, కానీ మూసీ శుద్ధికి మా కృషి ఉంటుందనే మాట ఇచ్చాం” అని తెలిపారు.
Mahesh Goud : ఈనెలలోనే మంత్రివర్గ విస్తరణ.. టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన