BRS Mahadharna : లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ, అల్లుడు, అన్నాదమ్ముళ్ల కోసమే రేవంత్ పనిచేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం 3 వేల ఎకరాల భూములు తీసుకుంటామంటే గిరిజన రైతులు తిరగపడ్డారని మాజీ మంత్రి అన్నారు. 9 నెలలుగా నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడానికి ముఖ్యమంత్రికి సమయం లేదా అని ఆయన ప్రశ్నించారు.
ఏడాదిలో ఇరవైఎనిమిదిసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తిరుగుబాటు ఎదుర్కొంటున్నాడని లగచర్లకు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేశారు. కానీ..రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టేవాళ్ళు అని కేటీఆర్ అన్నారు. రేవంత్‌కు మహారాష్ట్ర ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారన్నారు. తనను రాళ్లతో కొడతామని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని, వారిపై పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో మానుకోట రాళ్ల దాడి నుంచే నిప్పు పుట్టిందని గుర్తుచేశారు. ఆ నిప్పు నుంచే తెలంగాణ వచ్చిందన్నారు. నేడు లగచర్లలో జరిగింది.. రేపు రాష్ట్రంలో ఇంకెక్కడైనా జరుగొచ్చని కేటీఆర్ విమర్శించారు.
ఇంకా నాలుగు రోజులు అయితే ఈ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది.. ఆరు గ్యారెంటీలో ఒక హామీ అయినా అమలైందాని ప్రశ్నించారు. గిరిజనుల రిజర్వేషన్ 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారని మానుకోట మొదటి అడుగు మాత్రమే.. రాష్ట్రంలోని ప్రతి తండా, పల్లెకు వెళ్లి మద్దతు కూడా కడతామని కేటీఆర్ అన్నారు. జైల్లో పెట్టిన 30 మందికి సంఘీభావంగా మానుకోటలో ధర్నా చేస్తామంటే.. అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ రైతులు ఏడాది పాటు నిరసన తెలిపితే నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నారని రేవంత్ రెడ్డి రైతులతో పెట్టుకున్నారని ఇక ఖాతమే అని కేటీఆర్ హెచ్చారించారు.
Read Also: Ranganath House : మా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు : ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్