Site icon HashtagU Telugu

Hyderabad: జీహెచ్‌ఎంసీ-హెచ్‌ఎండీఏపై సీఎం రేవంత్ ఫోకస్

CM Revanth Reddy

CM Revanth Reddy

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గత ప్రభుత్వ లెక్కలపై ఆరా తీస్తున్నారు. ఆయా శాఖల మంత్రుల తమ శాఖలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమీక్షలు నిర్వహించారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ-హెచ్‌ఎండీఏపై సమీక్ష చేయనున్నారు. ఈ మేరకు ఈ నెల 25 తర్వాత జీహెచ్‌ఎంసీ-హెచ్‌ఎండీఏపై ప్రభుత్వం సమీక్షించనుంది. జీహెచ్‌ఎంసీ-హెచ్‌ఎండీఏ పరిధిలో నివేదిక రూపొందించాలని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారుల్ని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులు, ఆస్తిపన్ను జాబితాపై జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది.ఇక హెచ్‌ఎండీఏ పరిధిలో ఓఆర్‌ఆర్ టెండర్లు, భూముల వేలంతోపాటు పెండింగ్‌లో ఉన్న పనుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఆదాయ మార్గాల్లో భాగంగా ఈ రెండింటిపైనా ప్రభుత్వం సమీక్ష చేపట్టనుంది. కాగా మున్సిపల్ శాఖను సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉంచుకుని ప్రతేకంగా నిర్వహించనున్నారు.

Also Read: workouts: చలికాలం వర్కవుట్స్ చేయడం కలిగే ప్రయోజనాలివే