Site icon HashtagU Telugu

Praja Palana Website: ప్రజాపాలన కోసం వెబ్‌సైట్.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Praja Palana Website

Praja Palana Website

Praja Palana Website: తెలంగాణలో ప్రజాపాలనకు అడుగులు పడుతున్నాయి.ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని అమలు చేయగా మిగతా ఐదు గ్యారంటీలను కూడా ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పీయేడు పెంచింది. అందులో భాగంగా ఈ రోజు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన వెబ్ సైట్ ను ప్రారంభించనున్నారు.

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగిన ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 25 లక్షల 84 వేల 3 వందల 83 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అయితే వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం దరఖాస్తు వివరాలను ఆన్ లైన్ చేసేందుకు సిద్దమవుతుంది.ఈ దరఖాస్తులనన్నింటినీ జనవరి 17 వ తేదీ లోగా డేటా ఎంట్రీ చేయనున్నారు. అంతుకుముందు దీనికి సంబందించిన వివరాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకురానుంది. అంటే పబ్లిక్ డొమైన్ అన్ని వివరాలను పొందుపర్చనుంది. ఈ నేపథ్యంలో డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ముఖ్యమంత్రి నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సి.జి.జి డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమీషనర్ తదితర ఉన్నతాధికారులు హాజరవుతారు. కాగా ప్రజాపాలనపై తయారుచేసిన వెబ్ సైట్ https://prajapalana.telangana.gov.in/ ను సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేయనున్నారు.

Also Read: Bhatti Vikramarka: నెలరోజుల పాలనపై భట్టి ట్వీట్