Site icon HashtagU Telugu

Kite Festival : కైట్స్ ఫెస్టివల్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy Will Inaugurate Kites Festival

Cm Revanth Reddy Will Inaugurate Kites Festival

Kite Festival : నగరంలో మూడు రోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నగరంలోని పరేడ్ గ్రౌండ్‌లో కైట్ ఫెస్టివల్ ప్రారంభమవగా.. దాదాపు 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్‌ ప్రొఫెసనల్ కైట్ ప్లెయర్స్ ఫెస్టివల్‌లో పాల్గొననున్నారు. అలాగే 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్‌లో 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లెయర్స్ పాల్గొంటారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కైట్ ఫెస్టివల్ జరగనుంది. నోరూరించే పిండి వంటలతో స్వీట్ ఫెస్టివల్ కూడా ప్రారంభమవుతుంది.

7వ అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ను రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ, అంతర్రాష్టాల్లో పతంగులు ఎగురవేసే కైట్‌ ఫ్లైయర్స్‌ను ఆహ్వానిస్తూ హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో ఈ వేడుకలను నిర్వహిస్తోంది. కైట్‌ ఫెస్టివల్‌ కోసం తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన 60 మంది క్రీడాకారులు తరలిరానున్నారు. వీటిని తిలకించే సందర్శకుల కోసం షామియానా టెంట్లు, తాగునీటి ఏర్పాట్లను చేస్తున్నామని, పిల్లల కోసం ఆట వస్తువులను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన ఉండనుంది.

పతంగుల పండుగకు ఇండోనేషియా, స్విట్జర్లాండ్‌, ఆస్ర్టేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్‌, థాయిలాండ్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్‌, సౌత్‌ ఆఫ్రికా, నెదర్లాండ్స్‌, తదితర దేశాలకు చెందిన 50 మంది కైట్‌ ఫ్లైయర్స్‌ హాజరవుతున్నారు. వారితో పాటు గుజరాత్‌, పంజాబ్‌, తమిళనాడు, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్‌ల నుండి పలు క్రీడాకారులు తరలిరానున్నారు. కైట్‌ ఫెస్టివల్‌తో పాటు స్వీట్ల పండుగను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలుగు ప్రజలు ఇళ్లలో తయారు చేసుకునే పిండి వంటలతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన సంప్రదాయ వంటలు, స్వీట్లను ఇందులో పరిచయం చేయనున్నామని, ఈ మేరకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు సుమారు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని, ఉచిత ప్రవేశం ఉంటుందని అధికారులు తెలిపారు. మొత్తం 1100 జాతీయ, అంతర్జాతీయ స్వీట్లు, పిండి వంటలను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈసారి ఇరాన్‌, తుర్కియే, అప్ఘనిస్తాన్‌తో పాటు మరో తొమ్మిది దేశాలకు చెందిన 700 మంది హోమ్‌ మేకర్స్‌ ప్రదర్శనలో పాల్గొననున్నట్లు తెలిపారు.

Read Also: Komitireddy Venkat Reddy: అధికారులు బహుపరాక్.. మంత్రి కోమటిరెడ్డి కీలక సూచనలు