సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఓ పక్క బీజీ బీజీ పొలిటికల్ లైఫ్‌ను లీడ్ చేస్తూనే.. ఇటు కుటుంబంతో కూడా ఎంతో సరదగా గడుపుతుంటారు. ఈవిషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల హోలీ పండుగ సందర్భంగా తన మనవడితో సీఎం రేవంత్ రెడ్డి రంగులు చల్లుకుంటూ.. ఎంతో సరదాగా గడిపారు. అయితే.. ముఖ్యమంత్రి పదవి అంతా సాదాసీదా పదవి కాదు. ఆ పదవిపై ఎంతో ఒత్తిడి, బాధ్యత ఉంటుంది. ఇదే కాకుండా.. లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ఎన్నికల హడావిడి కూడా రాష్ట్రంలో మొదలైంది. అయితే.. ఈ బీజీ షెడ్యూల్‌లోనూ ఆయన కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు సమయం కేటాయించడం చాలా విశేషం.
We’re now on WhatsApp. Click to Join.
అయితే.. నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా SRH (Sun Risers Hyderabad) vs CSK (Chennai Super Kings) తలపడనున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌ను తిలకించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఉప్పల్ స్టేడియంకు రానున్నారు. ముఖ్యమంత్రికి సౌకర్యాలు కల్పించేందుకు స్టేడియం వద్ద సంబంధిత భద్రతా ప్రోటోకాల్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. తెలుగు ముఖ్యమంత్రులు క్రికెట్ మ్యాచ్‌లకు లేదా ఇతర బహిరంగ కార్యక్రమాలకు వెళ్లడం మనం సాధారణంగా చూడలేము, కానీ రేవంత్ భిన్నంగా ఉన్నారు. SRH -CSK మధ్య హై-ప్రొఫైల్ గేమ్ ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
అయితే.. ఇదిలా ఉంటే.. మిస్టర్ కూల్ ధోనీ (MS Dhoni)కి ఇదే చివరి ఐపీఎల్ అని వార్తలు రావడంతో.. ధోనిని చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఎగబడుతున్నారు. అందుకే.. ధోనీ ఆడే మ్యాచ్‌లు అన్నీ హౌజ్ ఫుల్ అవుతున్నాయి. ఉప్పల్ ఇందుకు అతీతం కాదనే చెప్పాలి.. ఎందుకంటే.. SRH vs CSK మ్యాచ్ టికెట్ బుకింగ్స్ మొదలుపెట్టిన 2 గంటల్లోనే అవి పూర్తైపోవడం.. ధోనీకి ఉన్న క్రేజ్‌ని స్పష్టంగా చెబుతోంది. ఎస్ఆర్హెచ్ అభిమానులు కూడా.. ధోనీని చూడాలని తహతహలాడుతున్నారు. అందుకే.. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ధోనీ మేనియా కచ్చితంగా కనిపిస్తుంది.
Read Also : Rashmika Mandanna Birthday : నేషనల్ క్రష్ బర్త్‌డే స్పెషల్.. పుష్ప-2 నుంచి శ్రీవల్లి పోస్టర్