CM Revanth : తెలంగాణ కొత్త గవర్నర్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్‌ రెడ్డి

2018 నుంచి 2023 వరకు ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగానూ జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు నిర్వర్తించారు.

Published By: HashtagU Telugu Desk
CM Revanth Reddy welcomed the new Governor of Telangana

CM Revanth Reddy welcomed the new Governor of Telangana

CM Revanth: తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnudev Verma)కు శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్వాగతం పలికారు. బుధవారం త్రిపుర నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న నూతన గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయంలో సాయుధ దళాల గౌరవ వందనాన్ని నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వీకరించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగవ గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నేత కేసీఆర్, విపక్ష పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.

రాజ కుటుంబానికి చెందిన జిష్ణు దేవ్‌ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. 1990 ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు.

Read Also: Uber New Service: ఉబ‌ర్ వాడేవారికి గుడ్ న్యూస్‌.. కొత్త ఫీచ‌ర్‌తో అందుబాటులోకి..!

  Last Updated: 31 Jul 2024, 03:44 PM IST