Site icon HashtagU Telugu

Yadadri : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy visits Yadadri Sri Lakshmi Narasimha Swamy

CM Revanth Reddy visits Yadadri Sri Lakshmi Narasimha Swamy

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శిచుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సీఎం కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి అర్చకులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు మంత్రులతో కలిసి ఆలయంలో ప్రవేశించిన ముఖ్యమంత్రికి ఆలయ ప్రధానార్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి చిత్రం ముద్రించిన శాలువాతో సీఎంను సత్కరించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆలయంలోని వసతులపై అధికారులతో చర్చించారు. భక్తులకు ఎలంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సూచించారు.

కాగా, తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రికి, మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. యాదగిరిగుట్ట హెలిప్యాడ్ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్‌రూమ్‌కి సీఎం రేవంత్‌ రెడ్డి చేరుకున్నారు. అనంతరం విష్ణు పుష్కరిణి చేరుకుని అంజలి ఘటించారు. అక్కడ నుంచి సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్నారు. ముందుగా అఖండ దీపారాధనను దర్శించుకుని దీపం వెలిగించి పూజలు చేశారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, తుమ్మల, పొన్నం, కొండా సురేఖ ఉన్నారు. ఇక వైటీడీ అధికారులతో సమీక్ష అనంతరం మూసీ ప్రవహించే సంగెం బ్రిడ్జి వద్దకు చేరుకుని అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.

Read Also: Yadadri Temple : తోపులాటలో ఇరుక్కుపోయిన మంత్రి సురేఖ..