TG : సకాలంలో వర్షాలు కురవడంతో తెలంగాణ లో నీటి సమస్య తీరింది – సీఎం రేవంత్

ఎలాంటి హడావుడి లేకుండా వైకుంఠం క్యూలైన్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన రేవంత్ కు టీటీడీ ప్రధాన అర్చకులు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు

Published By: HashtagU Telugu Desk
Revanth Tirupathi

Revanth Tirupathi

రెండు నెలలుగా నీటి సమస్య తో బాధపడుతున్న ప్రజలకు సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రంలో నీటి సమస్య ను తీర్చిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy). తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించేందుకు గాను మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు సీఎం రేవంత్ కుటుంబసభ్యులు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రచన అతిథి గృహానికి చేరుకున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేసిన రేవంత్ ఫామిలీ.. బుధవారం ఉదయం మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించి, కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా వైకుంఠం క్యూలైన్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన రేవంత్ కు టీటీడీ ప్రధాన అర్చకులు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సీఎం హోదాలో తొలిసారిగా తిరుమలకు వెళ్లారు రేవంత్‌రెడ్డి.

We’re now on WhatsApp. Click to Join.

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘రెండు తెలుగు రాష్ట్రాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు. తెలంగాణలో సకాలంలో వర్షాలు కురిసి నీటి సమస్య తీరింది’ అని ఆయన పేర్కొన్నారు.

Read Also : Buddha Purnima 2024 : ఇవాళే బుద్ధ పూర్ణిమ.. ఈ వేడుకలో దాగిన గొప్ప సత్యాలు

  Last Updated: 22 May 2024, 10:57 AM IST