తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) తన స్వగ్రామం కొండారెడ్డిపల్లి(Kondareddypalli )ని సందర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సీఎంను పూర్ణకుంభ స్వాగతంతో ఆహ్వానించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్రంలో సమయానికి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Bad Breath: ఏమి చేసిన నోటి దుర్వాసన పోవడం లేదా.. అయితే వెంటనే ఇలా చేయండి!
ముందుగా సీఎం నల్లమల ప్రాంతంలోని నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో ‘ఇందిరా సోలార్ జలగిరి వికాస పథకం’ను ప్రారంభించారు. అనంతరం రోడ్డుమార్గాన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లెకు చేరుకున్నారు. అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం, కుటుంబ సభ్యులతో కలిసి ఆ భక్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని తాను ఎంతో ఇష్టపడతానని పలుమార్లు పేర్కొన్న సీఎం, ఈ సారి తన మనవడిని కూడా ఆలయ దర్శనానికి తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్బంగా ఆలయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పూజారి తీర్థం పంచుతుండగా సీఎం మనవడికి మరిచిపోయాడు. ఇది రేవంత్ గమనించి పూజారిని పిలిచి “నా మనవడికి మొదట తీర్థం ఇవ్వండి” అన్నారు. ఈ సంఘటనను చూసిన వారంతా సీఎం మనవడిపై ఆయనకున్న ప్రేమను చూసి చిరునవ్వులు చిందించారు. చివరికి సీఎం తన టవల్‌ను మనవడి మెడలో వేసే ప్రయత్నం చేయగా, చిన్నోడు వెంటనే దానిని తీసేయడం చూసి గీతారెడ్డి నవ్వుకున్నారు. ఇది సరదా, ఆప్యాయతతో నిండిన సన్నివేశంగా మారింది.