CM Revanth Reddy Visits Khairatabad Ganesh : దేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎక్కడ చూసిన గణ నాథుల దర్శనాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడు (Khairatabad Ganesh) ఈ ఏడాది 70 అడుగుల శ్రీసప్తముఖ మహాశక్తి గణపతి (Sri Saptamukha Maha Shakti Ganapathi)గా భక్తులకు దర్శనమిస్తున్నారు. కొద్దీ సేపటి క్రితం లో గణేశుని విగ్రహం ప్రతిష్టించగా… లంబోదరుడికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ (Khairatabad Ganesh Puja) చేశారు.
సప్తముఖ వినాయకుడి వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి .. గణేషుడికి పండ్లు, ఫలహారాలు సమర్పించారు. వినాయకుని తొలిపూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంత ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే ఖైరతాబాద్.. ఉత్సవాలను నిర్వహించండంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికి తెలంగాణా రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్టతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణలో శాంతీ, మత సామరస్యం, పాడిపంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు ఆశీర్వాదంతోనే మన రాష్ట్రం ముందుడుగు వేస్తుందన్నారు. ఈ ఏడాదిలో అత్యధికంగా వర్షాలు కురిశాయి. దేవుడి దయతో వరదల వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. గణేశ్ ఉత్సవాలను ఇంత గొప్పగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు. గతేడాది పార్టీ అధ్యక్షుడిగా, ఈ ఏడాది సీఎంగా ఇక్కడికి వచ్చాను అని రేవంత్ తెలిపారు.
Read Also : Electricity Saving Tips : మీ కరెంటు బిల్లు తగ్గాలా ? ఈ టిప్స్ ఫాలో కండి