CM Revanth Reddy Unveils New Telangana MSME Policy : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(MSME) నూతన పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పారిశ్రామికరంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో, సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మార్గనిర్దేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridharbabu) నేతృత్వంలో ఈ విధానాన్ని పరిశ్రమల శాఖ తీర్చిదిద్దింది. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని సిఎం ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాలో వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నామని గతంలో చెప్పడం జరిగింది. చెప్పినట్లే ఈరోజు ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను తీసుకొచ్చారు. ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఈ పాలసీతో పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది.
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా నూతన MSME పాలసీని రూపొందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు పలు రాయితీలను కల్పిస్తున్నామన్నారు. ‘MSME ‘ల్లో ఆధునిక సాంకేతికతకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం. టెండర్ దరఖాస్తుకు ఖర్చు లేకుండా చేస్తున్నాం. పాలసీ విషయంలో 120 మంది పారిశ్రామిక ప్రముఖుల సలహాలు తీసుకున్నాం. రాష్ట్ర ఎకానమీని 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పాలసీని ఆవిష్కరించారు. 33 ఏళ్లకు భూమితోపాటు భవనాల లీజు, నియోజకవర్గానికి ఒక మహిళా పారిశ్రామికవాడ సహా పలు అంశాలను కొత్త విధానంలో చోటు కల్పించారు. ఎగుమతులు, కొత్త లైఫ్ సైన్సెస్, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల పాలసీలను కూడా త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.
Read Also : IND vs BAN Playing XI: కీపర్ రేసులో పంత్ వర్సెస్ ధృవ్