BRS : బిఆర్ఎస్ నేతలను కోతుల గుంపుతో పోల్చిన సీఎం రేవంత్

BRS : గత పదేళ్ల పాలనను విమర్శిస్తూ "తెలంగాణను కోతుల గుంపు చేతుల్లో పెట్టినట్లైందని" వ్యాఖ్యానించారు.

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Counter

Cm Revanth Counter

తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రవీంద్రభారతిలో జరిగిన బసవేశ్వర 892వ జయంతి వేడుకల్లో మాట్లాడిన సీఎం.. గత పదేళ్ల పాలనను విమర్శిస్తూ “తెలంగాణను కోతుల గుంపు చేతుల్లో పెట్టినట్లైందని” వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను ప్రజలు తప్పుగా చూడరాదని, తాము ప్రజల ఆశయాలు నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

MIC Electronics Limited : అంతర్జాతీయ ప్రమాణపత్రాలను అందుకున్న MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందని సీఎం పేర్కొన్నారు. సభకు అవసరమైన బస్సులు కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. కానీ ఆ సభలో ప్రజల సమస్యలపై చర్చ జరిగే అవకాశం ఉందనుకున్నా, విపక్ష నేత కేసీఆర్ ఆ అవకాశాన్ని వదులుకున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి కూడా కేసీఆర్ రావడం లేదని విమర్శించిన సీఎం, ప్రజాసమస్యలపై బీఆర్ఎస్ నేతలు నోరు విప్పడం లేదని ఆరోపించారు. ఫాంహౌస్‌లో కూర్చుని రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు.

తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చర్యలు, కొనసాగిస్తున్న పథకాలపై విమర్శలు అవసరం లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గత పాలనలో జరిగిన అవినీతిపై చర్చించడానికి సిద్ధమని, కేసీఆర్‌ను సభకు రావాలని సవాల్ చేశారు. రుణ మాఫీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఉద్యోగ నియామకాలు వంటి అంశాలపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. “పదేళ్లు మీరు దోచుకుని ఇప్పుడు మమ్మల్ని తెలంగాణ ద్రోహులు అంటారా?” అంటూ బీఆర్ఎస్‌ను ఉద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే పదేళ్లు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.

  Last Updated: 30 Apr 2025, 04:57 PM IST