Revanth : రేపు ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్న సీఎం రేవంత్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తుంది. ఇప్పటికే నేతలతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం..అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలను చర్చించారు. ఇక రేపటి నుండి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు రేవంత్. ఇందుకోసం ఇంద్రవెల్లి (Indravelli) ని ఎంచుకున్నారు. అక్కడి నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. We’re now on WhatsApp. Click to Join. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా […]

Published By: HashtagU Telugu Desk
Revanth Indravelli

Revanth Indravelli

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తుంది. ఇప్పటికే నేతలతో సీఎం రేవంత్ రెడ్డి
(CM Revanth Reddy) సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం..అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలను చర్చించారు. ఇక రేపటి నుండి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు రేవంత్. ఇందుకోసం ఇంద్రవెల్లి (Indravelli) ని ఎంచుకున్నారు. అక్కడి నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇంద్రవెల్లిలో భారీ సభ (Public Meeting) నిర్వహించి సీఎం అయిన తర్వాత తొలి సభను అక్కడే నిర్వహించబోతున్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలను ఆదేశించారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి నాగోబాను దర్శించుకోనున్నారు. నాగోబాను సందర్శించనున్న తొలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావడం విశేషం. సీఎం రాకతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించనున్నారు. ఆదిలాబాద్ నేతలకు మంత్రి సీతక్క పలు సూచనలు చేశారు. ఇంద్రవెల్లి సభను లోక్‌సభ ఎన్నికలకు శంఖారావ సభగా కాంగ్రెస్ పరిగణిస్తోంది. రాష్ట్రంలోని 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ సమావేశాన్ని నిర్వహించనుంది.

Read Also : Budget 2024: మ‌రికాసేప‌ట్లో బ‌డ్జెట్‌.. ఈ రంగాల‌పై మోదీ ప్ర‌భుత్వం వ‌రాలు కురిపించే ఛాన్స్‌..!

  Last Updated: 01 Feb 2024, 10:42 AM IST