Site icon HashtagU Telugu

Revanth Reddy : రేపు ఢిల్లీకు వెళ్లనున్న CM రేవంత్‌రెడ్డి..!

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ (Telangana)తో పాటు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్‌ అధిష్ఠానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ మేరకు తెలంగాణకు 22 మంది అబ్జర్వర్లను కూడా నియమించింది. సీనియర్‌ నాయకులకు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ (KC Venugopal) ఈ బాధ్యతలను కట్టబెట్టారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకునేందుకు ఏఐసీసీలో సీనియర్ నాయకులను ఇన్‌ఛార్జిలుగా నియమించింది.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) అధ్యక్షతన జరగబోయే సమావేశంలో రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో సీఎం రేవంత్‌తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొంటారు. ఇవాళ సాయంత్రమే వారు ఢిల్లీకి బయలుదేరుతారు. అయితే, ఈనెలాఖరున డీసీసీ అధ్యక్షులను ప్రకటించేందుకు ఏఐసీసీ (AICC కసరత్తు చేస్తో్ంది. మరోవైపు జిల్లా అధ్యక్ష పదవుల కోసం అశావహులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు

Exit mobile version