Revanth Reddy: హరీష్ రాజీనామాకు సిద్ధమా?

కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్ రావు గతంలో అన్న మాటలను సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తున్నామని అలాగే నువ్వు అన్నమాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి సూచించారు

Revanth Reddy: గత ఏడు నెలల రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై బుధవారం ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు, దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఈ నెలాఖరులోగా రూ.1.5 లక్షల రైతుల రుణాలు మాఫీ అవుతాయని, ఆగస్టు నాటికి రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. పంట రుణాల మాఫీ పేరుతో రైతులను తప్పుదోవ పట్టించడం లేదని స్పష్టం చేశారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు కట్టుబడి ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం ద్వారా రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతోందని కాంగ్రెస్ కార్యకర్తలు రైతులకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. పంట రుణాల మాఫీపై గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కార్యక్రమాలను క్యాడర్లు నిర్వహించాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్ రావు గతంలో అన్న మాటలను సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తున్నామని అలాగే నువ్వు అన్నమాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి సూచించారు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించా మన్నారు రేవంత్ రెడ్డి.

దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఒకేసారి రూ.31 వేల కోట్ల పంట రుణమాఫీని అమలు చేయలేదని, తెలంగాణలో పంట రుణమాఫీపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ ఎంపీలు అందరికి తెలిసేలా చేయాలనీ రేవంత్‌రెడ్డి అన్నారు. .గత ఏడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు.గురువారం అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో రైతు వేదికల వద్ద బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించిన ఆయన.. తమ నియోజకవర్గాల్లో పండుగ వాతావరణంలో జరిగే వేడుకల్లో చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యేలను కోరారు.

పంట రుణాల మాఫీపై కాంగ్రెస్ నేతలు నిద్రలేని రాత్రులు గడిపారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రేవంత్ రెడ్డి ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించినప్పుడు, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అందరూ ఇది సాదా ఎన్నికల వాగ్దానంగా భావించారు. కానీ ప్రతి ఒక్కరి సందేహాలను నిజం చేస్తూ రూపాయి రూపాయి నిధులను జాగ్రత్తగా సమీకరించినందున మేము రుణమాఫీని అమలు చేయబోతున్నాము అని ఆయన అన్నారు. మిగులు బడ్జెట్‌తో ‘కేసీఆర్‌ ప్రభుత్వం’ అధికారంలోకి వచ్చినప్పటికీ దశకు రూ.25 వేల చొప్పున నాలుగు విడతల్లో రలక్ష రుణమాఫీ పథకాన్ని అమలు చేసిందన్నారు. అయితే వారసత్వంగా రూ.7 లక్షల కోట్ల రుణభారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనా, కొన్ని నెలల వ్యవధిలోనే రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఐదు హామీలను అమలు చేసిందని, అయితే ఆ పథకాలపై క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ప్రచారం జరగడం లేదన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ రైతులకు చేరవేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం మాటకు కట్టుబడి రుణమాఫీని అమలు చేస్తోందని వారికి తెలియజేయాలని కాంగ్రెస్‌ నాయకులను కోరారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Also Read: Encounter : భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోయిస్టుల హతం

Follow us