CM Revanth Reddy: గుంపు మేస్త్రి అన్న వాళ్ళ చంప చెళ్లుమనిపించిన సీఎం రేవంత్

దావోస్ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలి సారి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఎల్బీ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మరియు సోషల్ మీడియా ట్రోలర్స్ కి చంప దెబ్బ కొట్టినట్టు వార్నింగ్ ఇచ్చారు

CM Revanth Reddy: దావోస్ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలి సారి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఎల్బీ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మరియు సోషల్ మీడియా ట్రోలర్స్ కి చంప దెబ్బ కొట్టినట్టు వార్నింగ్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో రేవంత్ మాట్లాడుతూ.. సీఎం పదవి అనేది గుంపు మేస్త్రి పాత్ర వంటిదని చేసిన వ్యాఖ్యలపై విమర్శలొచ్చాయి. సోషల్ మీడియాలో ఆ లైన్ తీసుకుని బాగా ట్రోల్స్ చేశారు. దాని వెనుక ఉన్నది బీఆర్ఎస్ అని అందరికీ తెలుసు.ఇప్పుడు రేవంత్ ఆ కామెంట్స్ పై స్పందించారు.

అవును నేను మేస్త్రినే అంటూ రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు విధ్వంసం చేసిన తెలంగాణని పునర్ నిర్మాణం చేస్తున్న మేస్త్రిని, మిమ్మల్ని ఘోరీ కట్టే మేస్త్రి నేనే అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ధ్వజమెత్తారు. ఈ నెలాఖరుకు ఇంద్రవెల్లి కి వస్తున్న కాసుకొండి బిడ్డలారా అంటూ కేసీఆర్ ని ఏకేశారు. తెలంగాణలో కాంగ్రెస్ చిన్న చిన్న కార్యకర్తలకు టికెట్ లు ఇస్తే ఎమ్మేల్యేలు అయ్యారు. మరి నువ్వు ఎవరికి టికెట్ లు ఇచ్చావు అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ఒక దళితున్ని ఎఐసిసి చీఫ్ చేసింది..మరి నువ్వు ఎవర్ని చేసావు అంటూ నిలదీశారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 17 పార్లమెంట్ స్థానాల్లో సభలు పెడతానని సీఎం అన్నారు. మొన్నటి ఎన్నికల్లో మీ పార్టీని ఒడించాము…ఈ ఎన్నికల్లో మేము గెలిచి బిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దులను దాటిస్తాము అంటూ కేటీఆర్, హరీష్ లను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. బిల్లా,రంగాలు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు..చార్లెస్ సోబారాజు ఇంట్లో దుప్పటి పట్టుకుని పడుకున్నాడు. పులి బయటికి వస్తుంది అన్నాడు కదా రమ్మని చెప్పండి బోను పట్టుకుని రెడీ గా ఉన్నాము..మోడీ కేడి రెండు ఒక్కటే.. నాణేనికి మోడీ ఒక వైపు కెసీఆర్ ఒక వైపు…ఇక్కడ గెలిచిన ఒకటో రెండో సీట్లు కూడా కెసీఆర్ మోడీకి తాకట్టు పెడతాడు. కెసీఆర్ నీ పీక పిసికే బాధ్యత మా పార్టీ తీసుకుందని హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ దయ వల్లే నేను ముఖ్యమంత్రినయ్యానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరో రెండు హామీల అమలు కోసం ప్రభుత్వం సిద్ధమైందన్న ఆయన.. ఫిబ్రవరి చివరి వరకు రైతు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు వేస్తామని సీఎం చెప్పారు. అదేవిధంగా వంద రోజుల్లో మొత్తం 6 గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు.లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నా ..ఒక వైపు పాలన చూసుకుంటూనే ప్రజల్లో ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: Sr NTR : పాట లిరిక్స్ విని.. డాన్స్ చేయలేను అన్న ఎన్టీఆర్.. ఏంటి ఆ పాట..?