Gaddar Jayanthi : కేసీఆర్ ను క్రిమినల్ పొలిటిషియన్ గా గద్దర్ పోల్చాడట..

ఈరోజు గద్దర్ జయంతి (Gaddar Jayanthi) సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరిపారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి (Ravindra Bharathi )లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. అలాగే కేసీఆర్ గురించి గద్దర్ ఏమని చెప్పాడో సభ వేదికగా పంచుకున్నారు. ‘పొలిటిషియన్ తో కొట్లాడటం సులువు, క్రిమినల్ తో కొట్లాడటం అంతకన్నా సులువు. కానీ, క్రిమినల్ […]

Published By: HashtagU Telugu Desk
Revanth Gaddar

Revanth Gaddar

ఈరోజు గద్దర్ జయంతి (Gaddar Jayanthi) సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరిపారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి (Ravindra Bharathi )లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. అలాగే కేసీఆర్ గురించి గద్దర్ ఏమని చెప్పాడో సభ వేదికగా పంచుకున్నారు. ‘పొలిటిషియన్ తో కొట్లాడటం సులువు, క్రిమినల్ తో కొట్లాడటం అంతకన్నా సులువు. కానీ, క్రిమినల్ పొలిటిషియన్ తో కొట్లాడటం సులువు కాదని గద్దర్ తనతో చెప్పినట్లు రేవంత్ తెలిపారు. నీ ఎదురు ఉన్నది పొలిటిషియన్ అనుకుంటున్నావు కానీ క్రిమినల్ పొలిటిషియన్ అని కేసీఆర్ గురించి గద్దర్ నాతో అన్నారు’ అని రేవంత్ వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ఈ సందర్బంగా నంది అవార్డులు పునరుద్ధరించాలని సినీ ప్రముఖులు కోరారు. నంది పురస్కారాల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గద్దరన్న పేరుతో కళాకారులకు పురస్కారాలు ప్రదానం చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే జీవో జారీ చేస్తామన్నారు. అంతేగాక, ఇదే శాసనం నా మాటే జీవో అని ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యానించారు. గద్దర్ జయంతి సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లీ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

Read Also : Telangana: ఫామ్‌హౌస్‌లో మోడీతో కేసీఆర్ రహస్య చర్చలు

  Last Updated: 31 Jan 2024, 11:15 PM IST