ప్రస్తుతం ‘వైఫ్ లేకుండా ఉండొచ్చేమో గానీ వైఫై లేకుంటే ఉండలేని పరిస్థితులు’ వచ్చాయన్నారు సీఎం రేవంత్ (CM Revanth Reddy). శనివారం హైదరాబాద్ జేఎన్టీయూలో (JNTU) ఏర్పాటు చేసిన ‘నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య’ ( JNTU Quality Of Engineering Education Meeting) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘అభివృద్ధి చెందుతున్న దేశానికి సివిల్ ఇంజినీరింగ్ అత్యంత అవసరం. కొన్ని కళాశాలల్లో ఆ కోర్సు లేకుండా చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను కచ్చితంగా నడపాలి. ఈ కోర్సులు లేకుంటే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది.
విద్యా సంస్థలు పట్టాలు చేతిలో పెట్టి నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా మారడం తమ ప్రభుత్వానికి ఏమాత్రం సమర్థనీయం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో కాలేజీలు ప్రపంచ అవసరాలకు తగినట్టుగా సరికొత్త ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. అందుకు తమ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
దేశంలో తొలిసారిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక బకాయిలను కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసేలా.. మంత్రి శ్రీధర్ బాబుకు బాధ్యతలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం సహా అటానమస్ హోదా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ గ్రూప్ – 1, పరీక్షల వాయిదాపై కీలక వ్యాఖ్యలు చేశారు.
టీజీఎస్‌పీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతోందని.. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు. ‘గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే 1:50 రేషియోలో ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఇప్పుడు 1:100 పిలవాలని కొందరు కోరుతున్నారు. అయితే, ఇలా పిలవడానికి మాకు ఏ ఇబ్బందీ లేదు. కానీ కోర్టుల్లో ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే నోటిఫికేషన్‌లో చెప్పిన విధంగానే ఉద్యోగాల భర్తీ ఉంటుంది.’ అని స్పష్టం చేశారు.
డీఎస్సీ, గ్రూప్ – 2, 3 పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్లపై కూడా సీఎం స్పందించారు. పదేళ్లుగా ఉద్యోగాల భర్తీ సరిగ్గా జరగలేదని.. ఇప్పుడు పకడ్బందీగా నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయాలని కొందరు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు పోటీ పరీక్షలు వాయిదా కోసం పరితపిస్తున్నాయని ధ్వజమెత్తారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని స్పష్టం చేసారు.
ప్రస్తుతం ‘వైఫ్ లేకుండా ఉండొచ్చేమో గానీ వైఫై లేకుంటే ఉండలేని పరిస్థితులు’ వచ్చాయి. ఈరోజుల్లో తల్లిదండ్రులకు తీరికలేదు. పిల్లల్ని స్కూల్ కు పంపి వాళ్లు ఉద్యోగాలకు వెళ్తున్నారు. కానీ ఇంటికి వచ్చాక టైమ్ తీసుకొని పిల్లలకు సోషల్ రెస్పాన్సిబిలిటీ నేర్పించాలి. వారు ఫోన్లకు బానిసలు కాకుండా చూడాలి’ అని కోరారు.
Read Also : Pawan Kalyan : అనంత్ అంబానీ రిసెప్షన్ వేడుకలో ఏపీ డిప్యూటీ సీఎం సందడి