Site icon HashtagU Telugu

Teenamar Mallanna : తీన్మార్ మల్లన్నకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్

Mallanna Won

Mallanna Won

వరంగల్ – నల్లగొండ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..మల్లన్న కు బెస్ట్ విషెష్ అందించారు. ‘నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసనమండలికి ఎన్నికైన చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) గారికి శుభాకాంక్షలు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు.’ అని ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, తీన్మార్ మల్లన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలపై ప్రశ్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మల్లన్న గతంలో ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2021లో జరిగిన ఆ ఎన్నికల్లో ట్టి పోటీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించటంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గత నెల 27న పోలింగ్ జరగ్గా.. జూన్ 5న కౌంటింగ్ ప్రారంభమైంది. ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలవటంతో కౌంటింగ్‌కు మూడ్రోజుల సమయం పట్టింది.

Read Also : Ramoji Rao : రామోజీరావు నటించిన సినిమా ఏంటో తెలుసా..?