CM Revanth Reddy : మెగాస్టార్ చిరంజీవిని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే ప్రభుత్వ లక్ష్యంగా రండి మాతో చేతులు కలపండి అంటూ పిలుపునిచ్చిన పద్మ విభూషణ్, మెగాస్టార్ డా. చిరంజీవి గారిని అభినందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 04:35 PM IST

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభినందించారు. డ్రగ్స్ నియంత్రరణకు మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం ఇచ్చారని..ఈ సందర్బంగా వారిని అభినందిస్తున్నానని.. మిగతావారు కూడా ముందుకు వచ్చి డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి తోడ్పడాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీస్ మీట్‌కు హాజరైన సీఎం రేవంత రెడ్డి ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భాంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం ప్రభుత్వ బాధ్యత. అందుకే పోలీస్ వ్యవస్థకు కావాల్సిన నిధులు, అధికారులను కేటాయించాం. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్ అని అన్నారు.

గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయిని.. మీడియా వీటిపై ఫోకస్ చేయాలని కోరారు. పోలీసుల కృషికి మీడియా కూడా తోడవ్వాలని తెలిపారు. సినిమా వాళ్లు సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నారని.. వారి తోడ్పాటు కోసం కొంతైనా తిరిగివ్వాలని కోరారు. సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని అన్నారు. నేరాలు అరికట్టేందుకు కృషి చేసిన అధికారులకు ప్రత్యే గుర్తింపునిస్తామని తెలిపారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని వాటిని అరికట్టాలని పిలుపునిచ్చారు.

డ్రగ్స్ మహమ్మారితో కుటుంబం, వ్యవస్థ నాశనమవుతాయి. దురదృష్టవశాత్తు గల్లీ గల్లీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగింది. డ్రగ్స్ నియంత్రణకు సిబ్బందిని కేటాయించామని.. గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. చిన్నారులపై జరుగుతున్న దాష్టీకాలకు కారణం మాదకద్రవ్యాలే.. తెలంగాణ యువకులు డ్రగ్స్ కు బానిసలు కాదు.. సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలని సీఎం కోరారు. డ్రగ్స్ నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేసినవారికి పదోన్నతి కల్పిస్తాం. ఇందుకు సంబంధించి శాసనసభలో చర్చించి చట్టాన్ని రూపొందిస్తాం అన్నారు. డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తున్నా. ప్రతీ సినిమా విడుదల సందర్భంలో అదే నటీనటులతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా షార్ట్ వీడియో చేయాలి. ప్రతీ సినిమా థియేటర్‌లో సినిమా స్క్రీనింగ్‌కు ముందు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్‌కు సంబంధించి వీడియో ఉచితంగా ప్రదర్శించేలా చూడాలి. ఈ నిబంధనలకు సహకరించినవారికే అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.

Read Also : Girl Missing Case : పవన్ కళ్యాణ్ చొరవతో 9 నెల‌ల క్రితం అదృశ్యమైన యువ‌తి ఆచూకీ ల‌భ్యం..