మంగళవారం నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు ఫై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో ఆగ్రహం వ్యక్తం చేసారు. బిఆర్ఎస్ నేతలు CM హోదాను అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారని రేవంత్ అన్నారు. ‘ఏం పీకడానికి మేడిగడ్డ వెళ్లారని KCR ఎలా మాట్లాడుతారు..? అని ప్రశ్నించారు. MLAగా, CMగా, మంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన వ్యక్తే ఇలాంటి భాష మాట్లాడవచ్చా? ఇప్పటికే ప్రజలు బిఆర్ఎస్ ప్యాంట్లు విప్పారు. ఉన్న చొక్కా కూడా పీకుతాం. కుంగిన మేడిగడ్డ నుంచి నీళ్లు ఎలా ఎత్తిపోస్తారో బిఆర్ఎస్ చెప్పాలి. చర్చకు మేం సిద్ధం’ అని CM స్పష్టం చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ (Assembly)సమావేశాలు వాడీవేడిగా నడుస్తున్నాయి. తొలి సమావేశంలోనే అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శన బాణాలు సంధించుకోగా…బడ్జెట్ సమావేశాల్లో మరింత వాడీగా మాటలు సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఇరుపక్షాలు ఎక్కడ తగ్గడం లేదు.
We’re now on WhatsApp. Click to Join.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్(Congress)…వాటి అమలుపై కనీసం దృష్టి సారించలేదని బీఆర్ఎస్(BRS) విమర్శించింది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కడియం శ్రీహరి(Kadiam Srihari) ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఆరు గ్యారెంటీలతోపాటు కాంగ్రెస్(Congress) పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లు అమలు చేయాలంటే లక్షా 36వేల కోట్లు కావాలని….కానీ కాంగ్రెస్ అందులో సగం కూడా బడ్జెట్ లో కేటాయించలేదని పేర్కొన్నారు. కేవలం 53వేల కోట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు.
శ్రీహరి వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) కౌంటర్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి పట్టుమని రెండు నెలలు కూడా కాలేదని….అప్పుడే ఎదురుదాడులు, ఉద్యమాలు ప్రారంభిస్తే ఎలా అంటూ చురకలు వేశారు.
Read Also : Hair Growth: ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చాలు.. బట్టతలపై కూడా జుట్టు పెరగడం ఖాయం?